NTV Telugu Site icon

Superstar Krishna : నేడు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు

Superstar Krishna

Superstar Krishna

తెలుగు తెర దిగ్గజం, సూపర్‌ స్టార్‌ కృష్ణ మంగళవారం ఉదయం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే.. లెజెండరీ నటుడు కన్నుమూయడంతో తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కేవలం తెలుగు సినీ ప్రముఖులే కాదు, ఇండియన్‌ సినిమాకి చెందిన ప్రముఖులు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖులు కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అయితే.. నిన్న రాత్రి నానక్‌రామ్‌ గూడలోని కృష్ణ నివాసంలో కృష్ణ పార్థివ దేహం సందర్శనార్థం ఉంచారు. ఈ క్రమంలో.. కృష్ణ పార్థివదేహానికి ఇవాళ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. పద్మాలయా స్టూడియోస్‌కు కృష్ణ భౌతికకాయం తరలించనున్నారు.
Also Read : Syamala Devi: ప్రాణస్నేహితులు.. కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోయారు.. కన్నీటిపర్యంతమైన కృష్ణంరాజు భార్య

అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు కృష్ణ పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అయితే.. అనంతరం ఫిలింనగర్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నేడు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ రానున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులర్పించనున్నారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణం తెలుగు చిత్రపరిశ్రమకు ఓ చీకటి రోజుగా తెలుగు నిర్మాతల మండలి ఓ నిర్ణయంతీసుకుంది. నేడు షూటింగ్‌లు బంద్‌కి పిలుపునిచ్చింది. అంతేకాకుండా పలుచోట్ల కృష్ణ మృతికి సంతాపంగా సినిమా హాల్‌లను మూసివేశారు.

Show comments