NTV Telugu Site icon

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..‘ది రాజా సాబ్’ టీజర్‌ కు ముహూర్తం ఫిక్స్

Rajasaab

Rajasaab

Prabhas : ఈ ఏడాది ఇప్పటికే కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. అదే జోష్ లో మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే మూవీ చేస్తున్నాడు. హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ లుక్ కు విశేష స్పందన లభించింది. ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా రానుంది.

Read Also:Fire Accident : శేరిలింగంపల్లి లొ ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదం….

ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర న భూతో న భవిష్యత్ అనేలా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ చివరి నాటికి ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేయాలని.. క్రిస్మస్ కానుకగా ఈ చిత్ర టీజర్‌ను కూడా రిలీజ్ చేయాలని డైరెక్టర్ మారుతి ప్లాన్ చేస్తున్నాడట. దీనికోసం మారుతి తీవ్రంగా కష్టపడుతున్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ టీజర్‌తో ‘ది రాజా సాబ్’ సినిమాపై నెలకొన్న అంచనాలు రెట్టింపు కావడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Read Also:Sukumar: సుకుమార్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్

Show comments