వరుస ప్లాప్స్ తో ఇక రజనికాంత్ పనైపోయిందని మాటలు వినిపిస్తున్న టైంలో నెల్సన్ దిలీప్ కుమార్ తో ‘జైలర్’ సినిమా ప్రకటించాడు. రిలిజ్ కు ముందు ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి కోలీవుడ్‌లో సెకండ్ హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచి రజనీ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వస్తున్నాడు దర్శకుడు నెల్సన్. సన్ పిచర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : Bollywood Cinema : 15 ఏళ్ల క్రితం విడిపోయిన హీరో అండ్ డైరెక్టర్ కాంబో.. మళ్లీ ఇన్నాళ్లకు
‘జైలర్’ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో రజనీకాంత్ మాట్లాడుతూ “జైలర్ 2 చిత్రీకరణ పూర్తయింది, ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే నిర్మాణ సంస్థ (సన్ పిక్చర్స్) అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తుంది” అని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్‌కుమార్ తమ పాత్రలను రిపీట్ చేస్తుండగా.. బాలీవుడ్ దిగ్గజం మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఎస్.జె. సూర్య విలన్‌గా, షారుఖ్ ఖాన్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అతిథి పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. ‘జైలర్ 2’ తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్‌తో కలిసి నటించబోయే ప్రతిష్టాత్మక చిత్రం ‘KH x RK’ నెల్సన్ దర్శకత్వంలో షూటింగ్ ఆగస్టు 2026 నుండి ప్రారంభం కానుందని కూడా సూపర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు.
