Site icon NTV Telugu

HBD Sitara: కూతురికి పుట్టినరోజు అంటూ విషెస్ చెప్పిన సూపర్ స్టార్ దంపతులు..

Hbd Sitara

Hbd Sitara

HBD Sitara Mahesh babu Namrata: నేడు ఘట్టమనేని వారసురాలు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల కూతురు సితార పుట్టినరోజు. ఇకపోతే సితార కేవలం మహేష్ బాబు కూతురుగా మాత్రమే కాకుండా తన టాలెంట్ తో కూడా ఎంతోమందిని మెప్పించింది. సితార చిన్నప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది. పెయింటింగ్, యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్ ఇలా అనేక టాలెంట్ లతో ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది సితార. ఇక నేడు సితార 12 ఏడదిలోకి అడుగుపెడుతోంది. ఇకపోతే.. తాజాగా తండ్రి మహేష్ బాబు, తల్లి నమ్రత సీతారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Romance With Statue: ఇదేం కర్మరా బాబు.. పబ్లిక్ లో విగ్రహం ప్రైవేట్ పార్టుతో రొమాన్స్ చేసిన మహిళ..

ఈ సందర్భంగా మహేష్ బాబు తన కూతురుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. తన ఎక్స్ ఖాతా ద్వారా సూర్యుడి వెలుగు సీతారా మొఖంపై పడే ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. “హ్యాపీ 12 మై సన్ షైన్ ” అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తల్లి కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. సితార చిన్నప్పటి నుంచి ఉన్న అనేక ఫోటోలను ఓ వీడియో రూపంలో చేర్చి కూతురుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Daggubati Rana: ఉత్తమ నటుడిగా రానా.. ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌ కు గాను..

తాజాగా అనిల్ అంబానీ ఇంట జరిగిన వివాహం కార్యక్రమంలో మహేష్ బాబు దంపతులతో పాటు కూతురు సితార కూడా హాజరైన సంగతి తెలిసిందే. సితార ఇదివరకు ఓ బంగారు నగల వాణిజ్య ప్రకటనలో కూడా నటించి అందరి మన్నలను పొందిన సంగతి తెలిసిందే.

Exit mobile version