Guntur Kaaram : టీవీలోకి వచ్చేస్తున్న సూపర్ స్టార్ బ్లాక్ బస్టర్ మూవీ..టెలికాస్ట్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఆడియన్స్ తో పాటూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రిలీజ్ తర్వాత సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్, క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ మరియు డాన్స్ అన్ని ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. ఇదిలా ఉంటే ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టీవీల్లోకి వచ్చేస్తోంది.’గుంటూరు కారం’ మూవీ థియేటర్ రన్ ముగిసిన 28 రోజులకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది.
తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళ మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ భారీ వ్యూస్ తో అదరగొట్టింది. ముఖ్యంగా ‘గుంటూరు కారం’ హిందీ వెర్షన్ కి విపరీతమైన ఆదరణ లభించింది. ‘సలార్’ హిందీ వర్షన్ కంటే ‘గుంటూరు కారం’ హిందీ వర్షన్ కే ఎక్కు వ వ్యూస్ రావడం విశేషం. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘గుంటూరు కారం’ అతి త్వరలోనే బుల్లితెరపై సందడి చేయబోతోంది.తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా ‘గుంటూరు కారం’ మూవీని టీవీలో టెలికాస్ట్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ భారీ ధరకు దగ్గించుకుంది. ఈ క్రమంలోనే పండుగ సమయంలో సినిమాని టెలికాస్ట్ చేస్తే మంచి టీఆర్పి రేటింగ్ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఉగాది పండక్కి జెమినీ టీవీలో ‘గుంటూరు కారం’ సినిమాని టీవీలోచూడవచ్చు.. త్వరలోనే దీనికి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు..
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!