NTV Telugu Site icon

SRH vs MI: నేడు ముంబైతో సన్రైజర్స్ ఢీ.. 300 స్కోర్పై కన్నేసిన ఎస్ఆర్హెచ్

Mi Vs Srh

Mi Vs Srh

IPL-2024: ఐపీఎల్ లో ఇవాళ ( సోమవారం ) ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడబోతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది. అయితే, ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న హైదరాబాద్ టీమ్ 300 పరుగుల స్కోర్ పై కన్నేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసిన్, నితీశ్ కుమార్ రెడ్డి, భీకర ఫామ్ లో ఉండటంతో ఎస్ఆర్హెచ్ కు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. మరోవైపు, వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ డీలా పడింది. 11 మ్యాచ్ ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.

Read Also: Geethanjali Malli Vachindi : ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

అలాగే, ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్ లలో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదవ ర్యాంక్ లో కొనసాగుతుంది. కాగా, ముంబై ఇండియన్స్ జట్టులో బ్యాటింగ్ లో నిలకడ కనిపించడం లేదు. సూర్యకుమార్ కేకేఆర్ పై అర్ధ సెంచరీ తర్వాత మళ్లీ పెద్దగా రాణించలేదు. ఎంఐ క్యాప్టెన్ హార్థిక్ పాండ్యా అటు బౌలింగ్ లో ఇటు బ్యాంటింగ్ లో వరుసగా విఫలమవుతున్నాడు.. దీంతో విమర్శకుల నోటికి పని చెబుతున్నారు. అయితే, జట్టులో కేవలం రోహిత్ శర్మ, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, టీమ్ డెవిడ్ ఇలా దూకుడైన బ్యాటింగ్ తో రాణించడంలో జట్టు భారీ స్కోర్ చేస్తుంది. కానీ, ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం అని క్రీడా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Also: Gun Fire : కాలిఫోర్నియాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం

ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్ బెర్త్‌ల కోసం అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లకు ప్లేఆఫ్ ఆశలు పూర్తిగా కొల్పోయే పరిస్థితికి చేరుకున్నాయి. ఎక్కువ ఓటములు చెంది పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్లకు ప్లేఆఫ్ లో చోటు దక్కే ఛాన్స్ దాదాపుగా లేనట్లే అనుకోవాలి. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ లాంటి టీమ్స్ ఉన్నాయి. ఇవి ఎంత పోరాడినా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ఈ జట్లు ప్లే ఆఫ్ ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని చెప్పుకోవాలి.