NTV Telugu Site icon

SRH vs RR: రెచ్చిపోయిన ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్స్.. సన్‌రైజర్స్ భారీ స్కోర్..

Srh

Srh

ఈరోజు ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. రెండు జట్లు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రియాన్ పరాగ్ చేతిలో ఉంది. హైదరాబాద్ పగ్గాలు పాట్ కమ్మిన్స్ చేతిలో ఉన్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. బారిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ రెచ్చిపోయింది. 14 ఓవర్లలోనే 200 స్కోర్ పూర్తి చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించాలంటే 287 పరుగులు సాధించాల్సి ఉంది. ఇద్దరు కీలక ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయారు. ఇషాన్ కిషన్ 45 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. చివరి బాల్ వరకు ఆడిన ఇషాన్ కిషన్ (106) బౌలర్లకు చుక్కలు చూపించాడు. ట్రావిస్‌ హెడ్‌(67) మెరుపు వేగంతో ఆడాడు. క్లాసెన్(34), తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (30), అభిషేక్‌ శర్మ(24) పరుగులు సాధించారు.

READ MORE: Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 50,000 దాటిన మరణాల సంఖ్య..

అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ ఓపెనర్లుగా క్రీజులోకి దిగారు. మొదట్లోనే విరుచుకుపడిన అభిషేక్‌ శర్మ.. 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మహీష్ తీక్షణ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. యశస్వి జైస్వాల్ క్యాచ్ పట్టడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. ఇషాన్‌ కిషన్‌ క్రీజులోకి వచ్చాడు. వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అనంతరం ట్రావిస్‌ హెడ్‌ దంచి కొట్టాడు. 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తుషార్‌ దేశ్‌ పాండే బౌలింగ్‌లో హిట్‌ మేయర్‌కు క్యాచ్‌ ఇచ్చిన ట్రావిస్‌ హెడ్‌ (67).. పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో బరిలోకి దిగిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(30).. మహీష తీక్షణ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. నితీశ్, ఇషాన్ కిషన్ 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడటంతో హెన్రిచ్‌ క్లాసెన్‌ బరిలోకి క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్లాసెన్(34) వీర బాదుడు బాదాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో రియాన్‌ పరాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి క్లాసెన్‌ (34) వెనుదిరిగాడు. క్రీజ్‌లోకి వచ్చిన అంకిత్‌ వర్మ, అభివనవ్‌ మనోహర్‌ తుషార్‌ దేశ్‌పాండే బౌలింగ్‌లో వెంట వెంటనే ఔట్ అయ్యారు. మరోవైపు తుషార్ దేశ్‌పాండే(3), మహీష తీక్షణ(2), సందీప్‌ శర్మ(1) చోప్పున వికెట్లు తీశారు.