IPL 2023: వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రిటెన్షన్ విధానంలో భాగంగా రిలీజ్ చేసింది. అతడితో పాటు వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్‌ని కూడా సన్ రైజర్స్ వదిలేసింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా కేవలం 12 మంది ఆటగాళ్లనే రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగతా ఆటగాళ్లను వేలంలోకి విడుదల చేసింది. కేవలం మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్లా ఫరూఖీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్‌లను మాత్రమే రిటైన్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌తో పాటు నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్‌లను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే కేన్ మామ ఎప్పటికీ మనవాడే అంటూ సన్‌రైజర్స్ యాజమాన్యం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో వేలంలో తక్కువ ధరకు కొనుగోలు చేస్తామనే హింట్ ఇచ్చింది.
Always our Kane Mama! 🧡#SunRisersHyderabad #OrangeArmy pic.twitter.com/UkieccM3yP
— SunRisers Hyderabad (@SunRisers) November 15, 2022
అటు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కూడా రిటైన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. తమ కోర్ టీమ్‌పై పూర్తి నమ్మకం ఉంచిన ఆర్‌సీబీ.. ఎక్స్‌ట్రా ప్లేయర్లను మాత్రమే వేలంలోకి వదిలేసింది. గత ఏడాది ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా తెచ్చుకున్న జాసన్ బెహండార్ఫ్‌ను మళ్లీ ఆ జట్టుకే ఇచ్చేసింది. అతడితో పాటు విండీస్ ఆటగాడు రూదర్ ఫోర్డ్‌ను కూడా వదిలేసింది. హైదరాబాద్ క్రికెటర్ చామ మిలింద్‌తో పాటు ఇతర దేశవాళీ క్రికెటర్లు అనీశ్వర్ గౌతమ్, లువ్‌నిత్ సిసోడియాలను కూడా ఆర్‌సీబీ రిలీజ్ చేసింది.
Read Also: Shubman Gill: టీమిండియా యువ క్రికెటర్ సంచలన ప్రకటన.. బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ నిజమే..!!