SA20 League 2024: 52 పరుగులకే క్యాపిటల్స్ ఆలౌట్.. సన్‌రైజర్స్ సంచలన విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pretoria Capitals All-Out for lowest total in SA20 history: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సంచలన విజయాన్ని అందుకుంది. సెయింట్ జార్జ్ పార్క్‌లోని గ్కెబెర్హాలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను కేవలం 52 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇది దక్షిణాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు. దాంతో లీగ్ చరిత్రలోనే ప్రత్యర్థి జట్టును అత్యల్ప స్కోరుకు కట్టడి చేసిన జట్టుగా సన్‌రైజర్స్ రికార్డుల్లో నిలిచింది. స్వల్ప లక్ష్య చేధనను సన్‌రైజర్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ పేసర్లు చెలరేగడంతో ప్రిటోరియా క్యాపిటల్స్ 13.3 ఓవర్లలో కేవలం 52 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (10), విల్ జాక్స్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ అందుకున్నారు. మిగితా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రూసో, ఇంగ్రామ్, నీషమ్ వంటి డేంజరస్ ఆటగాళ్లు నిరాశపరిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మాన్ 4 వికెట్లతో క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. ఇక వారెల్ మూడు, మార్కో జానెసన్ రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- CM Vijay-Kamal haasan: సీఎం విజయ్‌తో కమల్‌హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
- AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
Also Read: Girl Drinking Beer: లైవ్ మ్యాచ్‌లో ఒక్క గుటికలోనే బీర్ మొత్తం తాగేసిన మహిళా అభిమాని.. వీడియో వైరల్!
53 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 6.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. డేవిడ్ మలన్ (1) విఫలం కాగా.. టామ్ అబెల్ (31; 22 బంతుల్లో), హెర్మన్ (20; 17 బంతుల్లో) జట్టును గెలిపించారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ నెట్ రన్ రేటును మెరుగుపర్చుకుని.. బోనస్ పాయింట్ కూడా సాధించింది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ మూడింటిలో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోగా.. మరో మ్యాచ్ రద్దు అయ్యింది.
A match to remember 🧡 pic.twitter.com/LW9pm3voEW
— Sunrisers Eastern Cape (@SunrisersEC) January 22, 2024
తాజావార్తలు
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్‌తో కమల్‌హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్‌తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..