NTV Telugu Site icon

Sunita Williams : మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్‌..

Sunita Williams10

Sunita Williams10

సునీతా విలియమ్స్ భారతీయులకు ఈ పేరు సుపరిచితమే. ఆమె గతంలో ఎన్నో విజయాలు సాధించారు. అమెరికాలో అత్యధిక స్టామినా ఉన్నవారి జాబితాలో సునీత రెండోస్థానంలో నిలిచారు. అంతరిక్షంలో ఎక్కువ సమయంపాటు గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. ఈమె ప్రస్తుతం మూడో అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. ఇంతకు ముందు 2006, 2012లో అంతరిక్షంలోకి వెళ్లివచ్చారు. రెండు మిషన్లలో 322 అంతరిక్షంలో గడిపారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు. సునీత 14 జూలై 2012న తన రెండోసారి అంతరిక్షయానం చేశారు. నాలుగు నెలలపాటు అంతరిక్షంలోనే గడిపి.. 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆమె అంతరిక్ష ప్రయాణంలో తనతో పాటు గణేశుడి విగ్రహం, ఉపనిషత్తులతో పాటు సమోసాలను తీసుకువెళ్లడం విశేషం.

READ MORE: Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘హిట్లర్’ ప్రవేశించాడు.. జో బైడెన్‌పై ట్రంప్ ఫైర్..!

ఈమె ప్రస్తుతం తన మూడో అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. బుచ్‌ విల్మోర్‌తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్‌ స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్‌లో ఈ నెల 7న స్పేస్‌లోకి దూసుకెళ్లనున్నారు. ఇంతకు ముందు బోయింగ్‌ కంపెనీ మానవ రహిత ప్రయోగాలు చేపట్టగా.. తొలిసారిగా మానవ సహిత యాత్ర చేపడుతున్నది. స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్ మంగళవారం ఉదయం 8.04 గంటలకు కెన్నడీ స్పేస్‌సెంటర్‌ నుంచి ప్రయోగించనున్నారు. ఈ సందర్భంగా సునీతా విలియమన్స్‌ మాట్లాడుతూ.. కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించబోతున్నందున తాను కొంచెం ఉద్విగ్నంగా ఉన్నానని చెప్పారు. అదే సమయంలో ఉత్సాహంగా ఉన్నానన్నారు. కాగా.. ఆమె భారత సంతతికి చెందిన వారు కావడం మన దేశానికి గర్వకారణమని పలువురు అంటున్నారు. అంతరిక్షంలోకి వెళ్లే టప్పుడు తన వెంట వినాయకుడి విగ్రహం, ఉపనిషత్తులు తీసుకెళ్లడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.