Site icon NTV Telugu

Sunil Kanugolu : పరారీలో సునీల్‌ కనుగోలు.. పలు కేసులు నమోదు..

Sunil Kanugolu

Sunil Kanugolu

సీఎం కేసీఆర్‌ తో పాటు.. ఎమ్మెల్సీ కవిత తదితరులపై కించపరిచే పోస్టుల కింద నమోదైన కేసుల్లో కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలును హైదరాబాద్‌ పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. మంగళవారం రాత్రి మాదాపూర్‌లోని ఓ కార్యాలయంలో సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తుల సమాచారం ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. అయితే.. సునీల్‌ కనుగోలు పరారీలో ఉన్నట్లు అదనపు పోలీసు కమిషనర్ విక్రమ్‌సింగ్ మాన్ విలేకరులకు తెలిపారు. కాంగ్రెస్ చేపట్టిన నిరసనపై పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరించారని స్పష్టం చేశారు.
Also Read : Pawan Kalyan: కీరవాణి కుటుంబానికి పవన్ ప్రగాఢ సానుభూతి

అది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యాలయం అని పోలీసులకు తెలియదని ఆయన తెలిపారు. ఆవరణలో కార్యాలయం పేరు, బోర్డు లేవని తెలిపారు. నిందితులు మాదాపూర్‌లోని మైండ్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ భవనంలో రహస్యంగా పనిచేస్తున్నారని, అవమానకరమైన పోస్ట్‌లపై వచ్చిన ఫిర్యాదులపై విచారణలో భాగంగా సైబర్ క్రైమ్ సాధనాలను ఉపయోగించి వారిని గుర్తించామని ఆయన తెలిపారు.

మోండా శ్రీప్రతాప్, శశాంక్ కాకినేని, ఇషాంత్ శర్మలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాము సునీల్‌ కింద పనిచేస్తున్నామని ఒప్పుకున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41 కింద నిందితులకు నోటీసులు జారీ చేసింది. నిందితులపై ఐపీసీ (IPC) సెక్షన్ 469 (ప్రతిష్టకు హాని కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ), 505 (2) (వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా దుష్ప్రవర్తనను సృష్టించడం లేదా ప్రోత్సహించే ప్రకటనలు) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఐదు కేసులు, నగరంలోని మరో నాలుగు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి.

10 ల్యాప్‌టాప్‌లు, సీపీయూలు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు విక్రమ్‌ సింగ్‌ తెలిపారు. ఇది చట్టబద్ధంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. “ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది ఆమోదించబడిన వ్యవస్థ. రాజకీయ విమర్శలు ఆరోగ్యకరమే కానీ వ్యక్తిగతంగా మహిళలను పట్టించుకోకుండా నేతలను టార్గెట్ చేస్తూ ఇలాంటి పోస్ట్ చేయడం విమర్శ కాదు. ఇది పూర్తిగా దుర్వినియోగం. ఎవరైనా విమర్శించాలనుకుంటే, వారు తమ గుర్తింపును వెల్లడించడానికి ధైర్యంగా ఉండాలి, ”అని ఆయన అన్నారు.

Exit mobile version