సునీల్.. విలన్ గా రానిద్దామని ఇండస్ట్రీ కి వచ్చిన సునీల్ కమెడియన్ గా తన సినీ కెరీర్ ను మొదలు పెట్టారు..సునీల్ తనదైన కామెడితో టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు.ఆ తర్వాత అందాల రాముడు సినిమా తో హీరోగా మారిన సంగతి తెల్సిందే. తన మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. సునీల్. కానీ ఆ తరువాత కూడా కమెడియన్ గా కొనసాగారు.. అయితే రాజమౌళి తో చేసిన మర్యాద రామన్న సినిమాతో సునీల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.. ఇక అప్పటి నుంచి హీరోగా కొన్నాళ్ల పాటు కంటిన్యూ అయ్యారు..కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో సునీల్ మళ్లీ కమెడియన్ గా కెరీర్ ను తిరిగి ప్రారంభించారు..
టాలీవుడ్ లో కామెడీ రోల్స్ చేస్తున్న సమయంలో పుష్ప సినిమా లో పవర్ఫుల్ పాత్రలో కనిపించారు.. ఆ పాత్ర కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సునీల్ కూడా బాగా పాపులర్ అయ్యారు. ఆయన ఇటీవల బ్లాక్ బస్టర్ విజయం సాధించిన రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో నటించారు. అలాగే తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన మహావీరుడు సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడు మరో తమిళ్ సినిమా మార్క్ ఆంటోనీ సినిమాలో సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.. తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ ట్రైలర్ తాజాగా విడుదల అయింది..ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సునీల్ క్యారెక్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సునీల్ కు ముందు ముందు తమిళం లో వరుసగా సినిమా లు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ నటుడు విజయ్ సేతుపతి కి ఏమాత్రం తగ్గకుండా సునీల్ ఇక నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమా లు చేయాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.
