Sunil Gavaskar: టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, భారత మహిళా క్రికెట్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్ మధ్య జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదివరకు గవాస్కర్ ఇచ్చిన తన మాటను నిలబెట్టుకుంటూ జెమిమాకు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించడమే కాకుండా.. ఆమెతో కలిసి పాట పాడాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Marurthi: బన్నీ ఫోన్ చేశాడు.. ప్రభాస్ ఫ్యాన్స్ ధైర్యం చెబుతున్నారు
గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ సునీల్ గవాస్కర్ జెమిమాను కలిశారు. మహిళల వన్డే ప్రపంచకప్ గెలిస్తే ఆమెతో కలిసి మ్యూజిక్ జామింగ్ సెషన్‌లో పాల్గొంటానని గవాస్కర్ ప్రామిస్ చేశారు. ఈ సందర్భంగా గవాస్కర్ ఆమెకు బ్యాట్ ఆకారంలో ఉన్న ఒక కస్టమైజ్డ్ గిటార్‌ను (Bat-ar) బహుమతిగా ఇచ్చారు. గిఫ్ట్ ఇస్తున్న సమయంలో తాను ఈరోజు “ఓపెనింగ్ బ్యాట్” కాదంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
Reliance Jio IPO: స్టాక్ మార్కెట్‌ను షేక్ చేయడానికి వస్తున్న ముఖేష్ అంబానీ ..
గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి ‘షోలే’ సినిమాలోని “యే దోస్తీ..” పాటను పాడుతూ ఎంజాయ్ చేశారు. దీనిపై జెమిమా మాట్లాడుతూ.. “సునీల్ సార్ తన మాట నిలబెట్టుకున్నారు, ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ బ్యాట్-గిటార్‌తో మేము పాటలు పాడాము” అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కొత్త సీజన్‌లో జెమిమా రోడ్రిగ్స్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు మెగ్ లానింగ్ సారథ్యంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న జెమిమా ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Gavaskar singing with Jemi post World Cup win promise finally fulfilled🔥plus what a cool guitar😍 pic.twitter.com/eGuklXjRlz
— Siya (@siyaagrawal18) January 9, 2026
