NTV Telugu Site icon

Sunil Chettri: తన చివరి అంతర్జాతీయ గేమ్‌పై ఆసక్తి రేపుతున్న సునీల్ చెత్రీ..

Sunil Chettri

Sunil Chettri

కువైట్‌తో 2026 ప్రపంచకప్ క్వాలిఫయర్ గేమ్‌ కు ముందు భారత ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీ తన చివరి ఆట అని గుర్తుంచుకోవడం కంటే.. మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం అని పేర్కొన్నాడు. జూన్ 6 న గురువారం నాడు జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే., 2026 ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో మూడో రౌండ్‌లో దాదాపుగా చోటు దక్కించుకుంటారు. ఈ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కువైట్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తన అంతర్జాతీయ కెరీర్‌ కు తెర గీస్తానని చెత్రీ గత నెలలో తెలిపిన విషయం తెలిసిందే.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి బిగ్ షాక్..బెయిల్‌ని తిరస్కరించిన కోర్టు..

రెండో రౌండ్ మ్యాచ్ సందర్భంగా ఛెత్రీ మాట్లాడుతూ.. “ఇది నా గురించి., నా చివరి మ్యాచ్ గురించి కాదు. నేను దానిని పదే పదే ప్రస్తావించాలనుకోలేదు. మేము నిజంగా ఈ గేమ్‌ ను గెలవాలనుకుంటున్నామని.. కాకపోతే అది అంత సులభం కాదని చెబుతూ, కానీ మేము సిద్ధంగా ఉన్నామంటూ.. మాకు అద్భుతమైన మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ” భారత్ రేపు గెలిస్తే దాదాపుగా రౌండ్ 3కి అర్హత సాధిస్తాం. స్వదేశంలో, బయట ఐదు అగ్రశ్రేణి ఆటలను నేను జట్టు ఎక్కడికి వెళ్లినా అక్కడ చక్కని సూట్లు ధరించి మ్యాచ్ చూడబోతున్నానని., ప్రతిరోజు నేను అబ్బాయిలతో మాట్లాడతాను, నేను వారితో దీని గురించి చెబుతూ ఉంటానని తెలిపాడు.

Maharaja OTT: విజయ్ సేతుపతి ‘మహారాజ’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఇట్స్ ఆఫీసియల్..

తన పదవీ విరమణ గురించి తిరిగి ఆలోచిస్తూ., తన పదవీ విరమణను వెనక్కి తీసుకునే ఉద్దేశం తనకు లేదని చెత్రీ పేర్కొన్నాడు. “లేదు సార్, సూట్‌లు వేసుకుని అబ్బాయిలు ఆడుకోవడం చూడ్డానికి వెళ్తున్నాను. దాని గురించి చాలా ఆలోచించాను. ఈ 19 ఏళ్లలో నేను చాలా అద్భుతంగా ప్రయాణించాను. జట్టు ఎక్కడికి వెళ్లినా అభిమానిగా వెళ్లి జట్టుకు మద్దతు ఇస్తాను ” అని ఆయన తన సందేశాన్ని ముగించారు.