Site icon NTV Telugu

Sunil Bansal : తెలంగాణ బీజేపీ ఇంచార్జీగా సునీల్‌ బన్సల్‌

Sunil Bansal

Sunil Bansal

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ అధిష్టానం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ బీజేపీ ఇంచార్జీగా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సునీల్ బ‌న్స‌ల్‌ను నియమిస్తూ ఉత్వర్వులు జారీచేసింది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. అయితే.. రెండు సార్లు ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర వహించారు బన్సల్.

అంతేకాకుండా.. అమిత్ షా కి అత్యంత సన్నిహితుడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో యూపీ లో అమిత్ షా తో కలిసి పనిచేశారు బన్సల్. ప్ర‌స్తుతం బీజేపీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాఖ ప్ర‌ధాన కార్య‌దర్శిగా కొన‌సాగుతున్న బ‌న్స‌ల్‌కు తాజాగా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి క‌ల్పించారు జేపీ నడ్డా. అంతేకాకుండా ఆయ‌న‌కు తెలంగాణ పార్టీ శాఖ ఇంచార్జీ బాధ్య‌త‌ల‌తో పాటుగా ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా శాఖ‌ల ఇంచార్జీగానూ నియమించింది బీజేపీ అధిష్టానం.

 

Exit mobile version