సునీల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ కు విలన్ అవుదామని వచ్చి సునీల్ స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. అప్పట్లో సునీల్ కు డిమాండ్ మాములుగా ఉండేది కాదు. ఆయన కోసమే రైటర్‌లు స్పెషల్ గా కామెడీ క్యారెక్టర్ ను డిజైన్ చేసేవారు.కమెడియన్ గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సునీల్ అనూహ్యంగా అందాల రాముడితో హీరో గా మారాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.. ఆ సినిమా తరువాత కూడా కమెడియన్ గా రాణించాడు సునీల్.ఆ తర్వాతే ఏకంగా స్టార్ దర్శకుడు రాజమౌళితో మర్యాదరామన్న సినిమా చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఇక అదే ఊపు లో హీరో గా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు.అయితే కమెడియన్ గా రాణించిన సునీల్ ను ప్రేక్షకులు హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోయారు.
తన స్నేహితుడు మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత సినిమా తో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు. ఇక అప్పటి నుంచి సునీల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.పైగా సునీల్ అలాంటి పాత్రలే చేస్తానని ఎటువంటి కండీషన్‌లు పెట్టకుండా .. వచ్చిన ప్రతీ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. సునీల్ క్రేజ్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ కి చేరింది.. అక్కడ సునీల్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి.. జైలర్ సినిమాలో సునీల్ నటన తమిళ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. శివ కార్తికేయన్ నటించిన మహావీరుడు సినిమాలో సునీల్ రోల్ కు మంచి స్పందన లభించింది. సునీల్ ప్రస్తుతం విశాల్ నటిస్తున్న మార్క్ ఆంటోని సినిమాలో అలాగే కార్తి నటిస్తున్న జపాన్ సినిమాలో సునీల్‌కు మంచి పాత్ర దక్కినట్లు సమాచారం.. ఇవే కాకుండా ఈగై, బుల్లెట్ అనే మరో రెండు తమిళ సినిమాల్లో సునీల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.ఇలా ఒక్క ఏడాదిలోనే దాదాపు ఆరడజను తమిళ సినిమాల్లో నటిస్తూ సునీల్ దూసుకుపోతున్నాడు..