NTV Telugu Site icon

Sundeep Kishan : సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించబోతున్న సందీప్ కిషన్..

Whatsapp Image 2023 09 25 At 7.14.36 Pm (1)

Whatsapp Image 2023 09 25 At 7.14.36 Pm (1)

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ సరి కొత్త తరహా చిత్రాలలో తనదైన నటన కనబరుస్తూ తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో ‘ఊరు పేరు భైరవకోన అనే సినిమా’ చేస్తున్న సందీప్ కిషన్ ఆ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం 26 చేయడానికి కూడా సైన్ చేశారు. మాయవన్ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో సందీప్ కిషన్ మరియు దర్శకుడు సివి కుమార్ ఈ చిత్రం కోసం మరోసారి కలిసి పని చేస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణ లో రాంబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే కిషోర్ గరికిపాటి (జికె) ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వున్నారు.మాయవన్ వరల్డ్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, మాయవన్‌కి సీక్వెల్ కానున్నట్లు తెలుస్తుంది.

టాప్-క్లాస్ ప్రొడక్షన్ మరియు హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం ఒక సామాన్యుడి ఘర్షణ కథగా వుండబోతుంది.అయితే ఈరోజు లాంఛనం గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు దామోదర్ ప్రసాద్ క్లాప్‌ ఇవ్వగా, వెంకట్ బోయనపల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కి జెమినీ కిరణ్‌ దర్శకత్వం వహించారు. నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది.ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ కె తిల్లై సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు., నాని దసరాకి అదిరిపోయే ఆల్బమ్ అందించి మంచి పేరు తెచ్చుకున్న సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ఈయన ప్రభాస్ నటిస్తున్న  పాన్ వరల్డ్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే..అయితే ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.