NTV Telugu Site icon

Sundaram Master OTT : ఓటీటీలోకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sundarammaster

Sundarammaster

యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన వారిలో వైవా హర్ష కూడా ఒకరు.. తన టాలెంట్ తో వరుస అవకాశాలను అందుకుంటూ కమేడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఎన్నో సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ నటిస్తూ వస్తున్నాడు.. ఇటీవల సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. టైటిల్ రోల్ లో నటించిన హర్ష అదిరిపోయే పెర్ఫార్మన్స్ కు జనం ఫిదా అయ్యారు.. దాంతో సినిమా మంచి టాక్ ను అందుకుంది.. ఆ సినిమా పాజిటివ్ టాక్ తో పాటుగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకోలేక పోయింది..

ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరను అందుకున్నాయి.. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా నేడు (మార్చి 28) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ‘మాస్టారు.. మాస్టారు మీ మనసులను గెలవడానికి వచ్చేశారు.. అంటూ తాజాగా ఆహా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.. ఈ సినిమాను మొదట రెండు ఓటీటిల్లో విడుదల చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఫైనల్లీ ఆహాలోకి వచ్చేసింది.. థియేటర్లలో చూడటం మిస్ అయిన వాళ్లు ఇక్కడ చూసేయ్యండి..

ఈ సినిమాకు కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వైవా హర్షతో పాటు దివ్య శ్రీపాద, హర్షవర్ధన్, బాలకృష్ణ నీలకంఠపు, భద్రం కీలకపాత్రలు పోషించారు. ఆర్టీ టీమ్ వర్క్స్, గోల్‍డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్ కుమార్ ఈ మూవీని నిర్మించారు.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ప్రపంచంతో సంబంధం లేని ఓ అటవీ గ్రామానికి మాస్టారు గా వెళ్లిన హర్ష ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారు అనేది ఈ సినిమా కథ..

Show comments