మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న 42 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ ఆదివారం రాత్రి లక్సెట్టిపేట పట్టణంలో వడదెబ్బతో మరణించాడు. అంకతివాడకు చెందిన ముతే సంతోష్ రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన నివాసంలో కుప్పకూలిపోయాడు. వెంటనే లక్సెట్టిపేటలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్ ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చాడు. వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంతోష్ 2000 సంవత్సరంలో పోలీసు శాఖలో చేరాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read : Prabhas: ప్రభాస్ ప్యూర్ లవ్‌స్టోరీ? అంత రిస్క్ అవసరమా అధ్యక్షా?
ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నెల 18 వరకు ఎండల తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా వాతావరణ శాఖ తెలిపింది. మొన్న నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, జనగాం జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అందువల్ల నిన్నటి నుంచి ఉత్తర తెలంగాణలోని 14 జిల్లాల్లో అత్యధిక ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి, కరీంనగర్, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కొమురం భీం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో వేడి గాలులు ఎక్కువగా వీస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా బొగ్గు గనులు ఉండే జిల్లాల్లో.. భూమి నుంచి వేడి పైకి వస్తూ.. భరించలేని ఉక్కపోత ఉంటుందని తెలిపారు.
Also Read : Vemulawada Temple : వేములవాడ రాజన్న ఆలయంలో దొంగలు హాల్ చల్