Great News for Cricket Fans ahead of Asia Cup Final: ఆసియా కప్ 2023 ఫైనల్‌కు సమయం ఆసన్నమవుతోంది. మాజీ ఛాంపియన్స్ భారత్, శ్రీలంక మధ్య నేడు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలోని ఆర్ ప్రేమదాస మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. టైటిల్ లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఓడించిన భారత్ ఫైనల్‌కు దూసుకొస్తే.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ను ఓడించిన శ్రీలంక ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరెట్ అయినా.. లంకను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ 2023 మ్యాచ్‌లలో అందరి కన్నా నిలకడైన ప్రదర్శన చేసింది ‘వరుణుడు’ అని చెప్పాలి. 1-2 మ్యాచ్‌లు మినహా అన్ని మ్యాచ్‌లకు వరుణుడు అడ్డు పడ్డాడు. ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్‌కు కూడా వరుణుడు ముప్పు పొంచి ఉంది. కొలంబో వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం నాడు వర్షం పడే అవకాశాలు ఉన్నయ్యి. సాయంత్రం పూట 50 నుంచి 80 శాతం వర్షం పడే ఛాన్సులు ఉన్నాయి. అయితే రోజు గడిచేకొద్దీ వర్షం పడే అవకాశాలు తక్కువ అని తెలుస్తోంది.
వర్ష సూచన నేపథ్యంలో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కష్టమే అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే కొలంబో (Colombo Weather)లో ప్రస్తుతం ‘సూరీడు’ వచ్చేశాడు. అక్కడ ఇప్పుడు ఎండ కాస్తోంది. దాంతో ఫైనల్ మ్యాచ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగే అవకాశం ఉంది. ఇక భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లాగే.. ఫైనల్‌కు కూడా రిజర్వ్ డే ఉంది. కాబట్టి ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆదివారం మ్యాచ్ పూర్తి కాకపోతే.. అక్కడి నుంచే సోమవారం మ్యాచ్ మొదలవుతుంది.
Sun shining in Colombo….!!!!
Great news for cricket fans for the final. [News24Sports] pic.twitter.com/8LS98M12rW
— Johns. (@CricCrazyJohns) September 17, 2023