NTV Telugu Site icon

Summer Temperatures: దంచికొడుతున్న ఎండలు.. మార్చిలోనే రికార్డులు బ్రేక్‌!

Summer Temperatures

Summer Temperatures

Temperatures Increase in Telugu States: వేసవి ప్రారంభం అయింది. మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మొదటి వారంలోనే వేడి విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు జిల్లాలలో శుక్రవారం (మార్చి 8) పగటి ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 35 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అంటే ఈసారి వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి.

మరోవైపు ఏపీలోని పశ్చిమ, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. మార్చి నుంచి మే వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గత ఏడాది కంటే వేడి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. మార్చి నుంచి మే వరకు జమ్మూకశ్మీర్‌, తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాల్లో హీట్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: R Ashwin: కెరీర్‌లో వందో టెస్ట్‌.. చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్న అశ్విన్‌!

ఎల్‌-నినో ప్రభావంతో ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్‌-నినో ప్రభావం 20243 జూలై నుంచి కొనసాగుతోంది. దీని ప్రభావంతో గత వర్షాకాలంలో ఎక్కువగా వానలు కురవలేదు. 2023 ఆగస్టులో ఎప్పుడూ చూడని పరిస్థితి నెలకొంది. గత డిసెంబర్-జనవరిలోనూ వర్షాలు పడలేదు. అంతేకాదు శీతాకాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా నమోదైంది. అయితే ఏప్రిల్‌ నాటికి ఎల్‌-నినో ప్రభావం తగ్గనుందని ఏఎన్‌వోఏఏసీపీసీ తెలిపింది.