NTV Telugu Site icon

Sumit Nagal : మరోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన టెన్నిస్ స్టార్..

Sumit Nagal

Sumit Nagal

Sumit Nagal : 26 ఏళ్ల భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ నెట్‌వర్క్‌ లలో ప్రకటించారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉందని నాగల్ తెలిపాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఇది నాకు అత్యుత్తమ క్షణమని అధికారికంగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసాడు. ఒలింపిక్ టార్గెట్ ప్రోగ్రామ్ (TOPS), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) వల్ల నేను దీన్ని సాధించగలిగానని ఆయన ఆతెలిపారు. వారందరికీ చాలా ధన్యవాదాలు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

Sonakshi Sinha: పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా ఇస్లాంలోకి మారుతుందా..? జహీర్ ఇక్బాల్ తండ్రి సంచలన ప్రకటన..

2020 టోక్యో ఒలింపిక్స్‌లో, లియాండర్ పేస్ తర్వాత వరల్డ్ గేమ్స్‌లో వ్యక్తిగత ఈవెంట్‌లో గెలిచిన మొదటి భారతీయుడిగా నాగల్ చరిత్ర సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ తొలి రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్‌ కు చెందిన డెనిస్ ఇస్తోమిన్‌ ను ఓడించిన భారత స్టార్.. రెండో రౌండ్‌లో డేనియల్ మెద్వెదేవ్ చేతిలో ఓడిపోయాడు. 26 ఏళ్ల నాగల్ 2024 సీజన్ ప్రారంభం నుంచి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండియన్ వెల్స్ మాస్టర్స్, మోంటే కార్లో మాస్టర్స్, ఏటీపీ 1000 టోర్నమెంట్‌ లకు అర్హత సాధించారు. కాగా ప్యారిస్ గేమ్స్‌లో పురుషుల డబుల్స్‌ లో రోహన్ బోపన, ఎన్. శ్రీరామ్ బాలాజీ జోడీ ఆడనుంది.

Petrol price hike: గోవాలోనూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు