Site icon NTV Telugu

Adipurush : ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటుడు సుమన్.

Whatsapp Image 2023 06 21 At 1.50.15 Pm

Whatsapp Image 2023 06 21 At 1.50.15 Pm

ఆదిపురుష్ సినిమా లో ప్రభాస్‌ రాముడి అవతారంలో కనిపించి మెప్పించాడు. కానీ ఆదిపురుష్‌ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్ వస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మొదటి మూడు రోజులు భారీగానే కలెక్షన్లు రాబట్టిన ఆ తరువాత క్రమంగా కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి..కొన్ని ఏరియాలలో వసూళ్లు బాగా తగ్గిపోతున్నాయి. మరోవైపు ఆదిపురుష్ ను వరుసగా వివాదాలు కూడా చుట్టు ముట్టాయి.చాలా చోట్ల ఈ సినిమా పై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్‌ నటుడు అయిన సుమన్‌ ఆదిపురుష్‌ సినిమా పై ఆసక్తికర కామెంట్లు చేశారు.నాగార్జున- రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీరామదాసు’ లో సుమన్‌ శ్రీరాముడిగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదిపురుష్‌ సినిమా పై స్పందించిన ఆయన.. ‘ రావణాసురుడు సీతను అపహరించడం నుంచి రక్షించడం వరకు మాత్రమే ఆదిపురుష్‌ సినిమాను తీశారు. ఇక మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల్లో రాముడికి మీసాలు, గడ్డాలు అస్సలు ఉండవు. అయితే ఇందులో రాముడిని సాధారణంగా చూపించి ఎంతో పెద్ద రిస్క్‌ను చేశారు. అయితే ఇక్కడ ప్రభాస్‌ను మాత్రం మెచ్చుకోవచ్చు. సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ఆ బాడీని మెయింటైన్‌ చేయడం అంత చిన్న విషయమం అయితే కాదు. అందుకు ప్రభాస్‌ను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే’

‘ఇక ఆదిపురుష్‌ లో డైరెక్టర్‌ చేసిన కొన్ని ప్రయోగాలు మాత్రం అంతగా మెప్పించలేక పోయాయి.. రావణుడి వేషధారణ మార్చడం అయితే చాలా తప్పు. ఇక గ్రాఫిక్స్‌ కూడా కొన్ని చోట్ల ఎంతో అద్భుతంగా ఉంది. కానీ మరికొన్ని చోట్ల అంతగా మెప్పించే విధంగా లేదు.. జానకిగా కృతిసనన్‌ అద్భుతంగా చేసింది. అయితే సినిమా లో చాలా వరకు ఎమోషన్‌ డ్రామా మిస్‌ అయ్యినట్లు కనిపించింది.. ఈ సినిమాకు పెట్టిన ఆదిపురుష్‌ టైటిల్ అనేది ఎంతో అద్భుతమైన టైటిల్‌ అని ఆయన చెప్పుకొచ్చారు.. అయితే సినిమాను చూసి ఎంతో నిరాశ చెందాను. ఇలాంటి పౌరాణిక సినిమాలను దక్షిణాది దర్శకులు ఎంతో బాగా హ్యాండిల్‌ చేస్తారు’ అని నటుడు సుమన్‌ చెప్పుకొచ్చారు.

Exit mobile version