Adipurush : ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటుడు సుమన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిపురుష్ సినిమా లో ప్రభాస్ రాముడి అవతారంలో కనిపించి మెప్పించాడు. కానీ ఆదిపురుష్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజులు భారీగానే కలెక్షన్లు రాబట్టిన ఆ తరువాత క్రమంగా కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి..కొన్ని ఏరియాలలో వసూళ్లు బాగా తగ్గిపోతున్నాయి. మరోవైపు ఆదిపురుష్ ను వరుసగా వివాదాలు కూడా చుట్టు ముట్టాయి.చాలా చోట్ల ఈ సినిమా పై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటుడు అయిన సుమన్ ఆదిపురుష్ సినిమా పై ఆసక్తికర కామెంట్లు చేశారు.నాగార్జున- రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీరామదాసు’ లో సుమన్ శ్రీరాముడిగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదిపురుష్ సినిమా పై స్పందించిన ఆయన.. ‘ రావణాసురుడు సీతను అపహరించడం నుంచి రక్షించడం వరకు మాత్రమే ఆదిపురుష్ సినిమాను తీశారు. ఇక మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల్లో రాముడికి మీసాలు, గడ్డాలు అస్సలు ఉండవు. అయితే ఇందులో రాముడిని సాధారణంగా చూపించి ఎంతో పెద్ద రిస్క్‌ను చేశారు. అయితే ఇక్కడ ప్రభాస్‌ను మాత్రం మెచ్చుకోవచ్చు. సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ఆ బాడీని మెయింటైన్ చేయడం అంత చిన్న విషయమం అయితే కాదు. అందుకు ప్రభాస్‌ను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే’
‘ఇక ఆదిపురుష్ లో డైరెక్టర్ చేసిన కొన్ని ప్రయోగాలు మాత్రం అంతగా మెప్పించలేక పోయాయి.. రావణుడి వేషధారణ మార్చడం అయితే చాలా తప్పు. ఇక గ్రాఫిక్స్ కూడా కొన్ని చోట్ల ఎంతో అద్భుతంగా ఉంది. కానీ మరికొన్ని చోట్ల అంతగా మెప్పించే విధంగా లేదు.. జానకిగా కృతిసనన్ అద్భుతంగా చేసింది. అయితే సినిమా లో చాలా వరకు ఎమోషన్ డ్రామా మిస్ అయ్యినట్లు కనిపించింది.. ఈ సినిమాకు పెట్టిన ఆదిపురుష్ టైటిల్ అనేది ఎంతో అద్భుతమైన టైటిల్ అని ఆయన చెప్పుకొచ్చారు.. అయితే సినిమాను చూసి ఎంతో నిరాశ చెందాను. ఇలాంటి పౌరాణిక సినిమాలను దక్షిణాది దర్శకులు ఎంతో బాగా హ్యాండిల్ చేస్తారు’ అని నటుడు సుమన్ చెప్పుకొచ్చారు.
Also Read
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్‌లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Nepal Floods: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
- కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
తాజావార్తలు
-
Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
-
TOXIC : టాక్సిక్ టాక్ ఏంటి.. డే-1 ఈ కలెక్షన్స్ ఏంటి?
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
-
Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్‌లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
-
Nepal Floods: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?