NTV Telugu Site icon

Sukhoi jet: నాసిక్లో కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం.. పైలట్, కో పైలట్ సేఫ్

Sukhoi Jet

Sukhoi Jet

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సుఖోయ్ ఫైటర్ జెట్ మంగళవారం ఓ పొలంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఈ ప్రమాదం భారీ నుంచి పైలట్, కో-పైలట్ ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలు కావడంతో వారిని హెచ్‌ఏఎల్ ఆసుపత్రికి తరలించారు. శిరస్‌గావ్ గ్రామ సమీపంలోని పొలంలో విమానం క్రాష్ అయిందని నాసిక్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డీఆర్ కరాలే తెలిపారు.

Read Also: Stock market: ఆశలు ఆవిరి.. మార్కెట్ చరిత్రలో భారీ ఎదురుదెబ్బ

ఈ జెట్‌లో పైలట్ బోకిల్, కో పైలట్ బిస్వాస్ ఉన్నారు. సుఖోయ్ ఫైటర్ జెట్ కుప్పకూలిన తర్వాత మంటలు చెలరేగాయని.. ఫైటర్ జెట్ భాగాలు 500 మీటర్ల దూరంలో పడినట్లు కరాలే చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత భారత వైమానిక దళం, హెచ్‌ఏఎల్ సెక్యూరిటీ, టెక్నికల్ యూనిట్ల బృందాలు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాయి.

Read Also: NDA: ఎన్నికల్లో ప్రభావం చూపని అయోధ్య రామాలయం.. ఫైజాబాద్‌లో ఎన్డీఏ వెనుకంజ

సుఖోయ్ ఎజెక్షన్ సిస్టమ్
సుఖోయ్ యుద్ధ విమానాలు రష్యాలో తయారు చేయబడిన జీరో-జీరో NPP Zvezda K-36DM ఎజెక్షన్ సీటును ఉపయోగిస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లైసెన్స్‌తో ఈ విమానం తయారు చేయబడింది. ఇది 20 సంవత్సరాలకు పైగా వైమానిక దళంలో పనిచేస్తోంది. అంతేకాకుండా.. ఈ విమానాన్ని MKI వెర్షన్ తో సరికొత్తగా తీర్చిదిద్దారు. భారతదేశ భౌగోళిక, వాతావరణం, ఇతర అవసరాలకు అనుగుణంగా ఈ యుద్ధ విమానాలు తయారు చేశారు. ఇందులో భారతీయ రాడార్, క్షిపణులు, ఉప వ్యవస్థలను అమర్చుతారు. Su-30MKI ఒక మల్టీరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది గాలి నుండి భూమి.. గాలి నుండి గగనతల యుద్ధంతో ఏకకాలంలో పోరాడగలదు. ఇది గాలిలో అతివేగంగా, తక్కువ వేగంతో విన్యాసాలు చేస్తూ శత్రువులను మోసగించి దాడి చేయగలదు.