NTV Telugu Site icon

Sukanya Samriddhi Yojana: బిగ్ అప్డేట్.. సుకన్య సమృద్ధి యోజనలో రూల్స్ చేంజ్..

Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana: భారతదేశంలోని అమ్మాయిల భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను అందించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సుకన్య సమృద్ధి యోజనలో ఓ పెద్ద మార్పు చేయబడింది. ఈ పథకంలో, కుమార్తె చదువు లేదా పెళ్లికి డబ్బును పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పుడు తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు మాత్రమే కుమార్తె ఖాతాను నిర్వహించగలరు. ఇది జరగకపోతే ఆ ఖాతాను మూసివేయబడుతుంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ రూల్ మార్పు గురించి వివరంగా తెలుసుకుందాం..

Dan Bilzerian with Girls: అబ్బబ్బబ్బ.. బాసూ..! ఒక్క రోజైనా నీలా బతకాలి.. అందమైన మోడల్స్.. లెక్కలేనంత డబ్బు..

కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని నరేంద్ర మోదీ (పీఎం నరేంద్ర మోదీ) ప్రభుత్వం 2015లో సుకన్య సమృద్ధి యోజన (SSY పథకం)ని ప్రారంభించింది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం కింద కేవలం రూ. 250తో ఖాతా తెరవవచ్చు. దీనిపై ప్రభుత్వం కూడా 8.2 శాతం మంచి వడ్డీ ఇస్తోంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఇది అమ్మాయిలను లక్షాధికారులను చేయడానికి ఉపయోగపడుతుంది. కుమార్తె భవిష్యత్తు కోసం భారీ నిధులను సేకరించేందుకు ఈ పథకంలో చేసిన తాజా నిబంధన మార్పు గురించి చూస్తే..

Nigeria : నైజీరియాలో బోకోహరమ్ ఉగ్రదాడి..100 మందికి పైగా మృతి

జాతీయ చిన్న పొదుపు పథకాల (SSS) కింద తెరిచిన సుకన్య ఖాతాలపై ఇది ప్రత్యేకంగా అమలు చేయబడుతుంది. కొత్త నియమం ప్రకారం, ఒక కుమార్తె SSY ఖాతాను ఆమెకు చట్టబద్ధమైన సంరక్షకుడు కాని వ్యక్తి తెరిచినట్లయితే.., ఆమె ఈ ఖాతాను తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడికి మాత్రమే బదిలీ చేయాలి. అలా చేయని పక్షంలో ఆ ఖాతాను మూసివేయవచ్చు. నివేదిక ప్రకారం, పథకంలో ఈ మార్పు అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది.

Show comments