NTV Telugu Site icon

Sujana Chowdary: చంద్రబాబు సీఎం అయితే అది ముళ్ల కిరీటమే..! అన్నీ ఓవర్ నైట్ చేయలేం..

Sujana Chowdary

Sujana Chowdary

Sujana Chowdary: చంద్రబాబు నాకు రాజకీయాల్లో అఆ లు నేర్పిన గురువే అన్నారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి సుజనా చౌదరి.. మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న ఆయన.. వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధాలు ఇచ్చారు.. చంద్రబాబు నాకు రాజకీయాల్లో అఆ లు నేర్పిన గురువే అని వ్యాఖ్యానించారు.. ఇక, నేను రాజకీయాలలోంచి బయటకు వెళ్తుంటే ఆపిన వ్యక్తి అరుణ్ జైట్లీ అన్నారు. నామీద ఈ భూమిమీద ఎక్కడా ఎఫ్ఐఆర్ లేదు.. నేను జ్యోతిష్యం చెప్పలేను.. ప్రజలపై నాకు నమ్మకం ఉందన్నారు.. నేను సముద్రంలో స్విమ్మింగ్ చేస్తా.. నేను మా సామాజిక వర్గం ఉన్నచోట పోటీ చేయలేదన్నారు. నగరాలు, ముస్లింలు నన్ను ఆదరిస్తారు.. బీజేపీ ముస్లింలకు ఏ అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. నేను కొండలు అన్నీ ఎక్కాను.. స్వతహాగా టీడీపీలోనే మొదలయ్యాను.. బీజేపీలోకి వచ్చాక బీజేపీ సిద్ధాంతమే అని స్పష్టం చేశారు.

నాకు ఇండియాలోని కార్పొరేట్లు కొందరితో పరిచయాలున్నాయని తెలిపారు సుజనా చౌదరి.. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రజలను మోసం చేసే యాక్ట్‌గా పేర్కొన్న ఆయన.. నా పొటో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు విషయంలో సోషల్ మీడియాలో పెట్టి యాంటీ సోషల్ మీడియా లాగా వాడారు అని మండిపడ్డారు. మేయర్ నా నియోజకవర్గంలో కూడా పట్టాలిచ్చేసారు.. తెలియక ఇచ్చేసారనుకుంటా.. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కు అర్ధం లేదని కొట్టిపారేశారు. చంద్రబాబు సీఎం అయితే అది ముళ్ల కిరీటమే.. అల్లవుద్దీన్ అద్భుత దీపంలా అన్నీ ఓవర్ నైట్ చేయలేమని స్పష్టం చేశారు.. మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన ఎవరు గెలుస్తారనే అన్ని రాజకీయ పార్టీలు చూసేది.. నియోజకవర్గంలో తిరిగాక నాకు మనసు కలచివేసింది, కళ్లు తెరుచుకున్నాయన్నారు. ఇక, రాజకీయ సంకల్పం కలిగిన రాజకీయ నేతలు ఇప్పుడు కనిపించలేదన్నారు. అభివృద్ధి దిశగా అమరావతి బ్లూ ప్రింట్ తయారు చేశారు.. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి.. కానీ కక్ష సాధింపు రాజకీయాలే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ చేసి ఆపేశారని మండిపడ్డారు.

బెజవాడ పశ్చిమ నియోజకవర్గంలో త్రాగు నీటి వసతి కూడా కనిపించలేదన్నారు సుజనా చౌదరి.. ఇక్కడ మంత్రిగా చేసిన వ్తక్తికి సీఎం అవకాశం ఇవ్వలేదని చెప్పాలన్నారు. ఇక, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆలస్యంగా వచ్చాను. నా జీవనం మొత్తం ఉమ్మడి కృష్ణాజిల్లానే.. స్ధానికత్వం గురించి మాట్లాడితే.. నేను స్ధానికుడినే అన్నారు. మహానటి సావిత్రికి మా తాతగారి ఇల్లు అమ్మారు.. ప్రకాశం బ్యారేజీకి ఇంజనీరుగా చేసారు మా నాన్న అని గుర్తుచేసుకున్నారు.. ప్రజా అవసరలు ఏవీ కూడా పశ్చిమంలో సరిగా ఏర్పాటు చేయలేదని విమర్శించారు.. పశ్చిమంలో రూపు రేఖలు మార్చేయచ్చు.. కనకదుర్గమ్మ ఆలయం తిరుపతి స్ధాయిలో ఎందుకు ఆలోచించలేదు? అని ప్రశ్నించారు. కమలం గుర్తుకి, సైకిల్ గుర్తుకి ఓటెయ్యండి.. అభ్యర్ధుల అనుభవం చూడండి.. అభ్యర్ధులను పోల్చుకుని చూడండి.. సంపద సృష్టించి సంక్షేమం చేయాలి.. లేకపోతే కొండలు సైతం కరిగిపోతాయన్నారు.

పోలవరం 2019 నాటికి 79 శాతం పూర్తయింది… నాలాంటి ఇంజనీరుకు ఇస్తే.. 24 నెలల్లో పూర్తయిపోయేదన్నారు సుజనా చౌదరి.. నాలెడ్జ్ లేకుండా సమాచారం మాత్రమే తీసుకుని పాలనకి వస్తే జరిగేది ఇదేనన్న ఆయన.. గంజాయి, బ్లేడు బ్యాచ్ లు నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నాం అన్నారు. విజయవాడ వెస్ట్‌ను ఒక గుర్తుగా, ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనేలా చేస్తాను అన్నారు. ఇక, స్పెషల్ కేటగరీ స్టేటస్ అనేది ఒక బ్రహ్మపదార్ధంలా చూపించారు.. మన ఏపీ 22 మంది ఎంపీలు ఏరోజూ రాష్ట్ర అభివృద్ధి గురించి పార్లమెంటులో మాట్లాడలేదని దుయ్యబట్టారు. బీజేపీ ఎంత చేసినా ఏ రోజూ చెప్పుకునే ప్రయత్నం చేయలేదన్నారు. మరోవైపు.. బీజేపీ , కాంగ్రెస్ కలిసే రాష్ట్ర విభజన చేశారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు చెప్పాడని రాష్ట్ర విభజన జరగలేదన్నారు. మద్రాసు నుంచి విడిపోయిన పరిస్ధితులు పునరావృతం కాకూడదనే హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటించాం అన్నారు బీజేపీ నేత, విజయవాడ వెస్ట్‌ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి.

Show comments