Site icon NTV Telugu

Pakistan: క్వెట్టాలో సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 10 మంది మృతి

Pakistan

Pakistan

క్వెట్టాలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో భారీ పేలుడు సంభవించింది. తూర్పు క్వెట్టాలో ఉన్న ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. తరువాత కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ళు, భవనాల ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్ వార్తల వెబ్‌సైట్ డాన్ ప్రకారం, ఈ పేలుడులో 10 మంది మరణించారని, 32 మంది గాయపడ్డారని నివేదించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

Also Read:JC Prabhakar Reddy: హౌస్‌ వైఫ్ అంటే అంత సులభమైన పని కాదు.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

బలూచిస్తాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ ముహమ్మద్ కాకర్, ఆరోగ్య కార్యదర్శి ముజీబ్-ఉర్-రెహ్మాన్ క్వెట్టాలోని సివిల్ హాస్పిటల్, బిఎంసి హాస్పిటల్, ట్రామా సెంటర్లలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గాయపడిన వారిని, మృతదేహాలను క్వెట్టా సివిల్ హాస్పిటల్‌కు పంపినట్లు రెస్క్యూ వర్గాలు నిర్ధారించాయి. ఈ పేలుడు నగరంలో భయాందోళనలకు దారితీసిందని వర్గాలు తెలిపాయి. సంఘటనా స్థలంలో కాల్పుల శబ్దం కూడా వినిపించింది. తరువాత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Also Read:Mammootty: మమ్ముట్టి హెల్త్ అప్‌డేట్..

పేలుడు శబ్దం, మంటలను చూపించే దగ్గర్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. రెస్క్యూ బృందాలు, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు, సెర్చ ఆపరేషన్ కోసం ఆ ప్రాంతాన్ని మూసివేశారు. క్వెట్టా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు రాజధాని. ఈ ప్రాంతం తీవ్రవాద హింసకు ప్రధాన కేంద్రంగా ఉంది. లష్కరే ఝాంగ్వీ (LeJ), ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) నేతృత్వంలోని సంఘటనలతో సహా వేర్పాటువాద, తీవ్రవాద హింస సంఘటనలు ఇక్కడ సర్వసాధారణంగా మారాయి.

Exit mobile version