NTV Telugu Site icon

Ambajipeta Marriage Band : అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సుహాస్ మూవీ.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?

Whatsapp Image 2024 02 05 At 1.00.52 Pm

Whatsapp Image 2024 02 05 At 1.00.52 Pm

టాలీవుడ్ యంగ్ హీరో ‘సుహాస్‌’ నటించిన లేటెస్ట్ మూవీ ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు ‘దుశ్యంత్‌ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా. శివాని నగరం హీరోయిన్‌గా నటిచింది. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే టాక్‌తో దూసుకుపోతోంది. కంటెంట్ బాగున్న సినిమాకు విజయం తప్పకుండా దక్కుతుందని అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 2.28 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజుల్లో ఏకంగా రూ.5.28 కోట్లు వసూలు చేసింది. తాజాగా మూడో రోజు కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ ఆదివారం కలెక్షన్ల సునామీ సృష్టించింది.ఇక ‘అంబాజీపేట’ ఆదివారం కలెక్షన్స్ చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.8.6 కోట్లు వసూళ్లు రాబట్టింది.భవిష్యత్ లో ఈ మూవీ 14 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుంది అని చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.ఈ సినిమాలో సుహాస్‌ హెయిర్ సెలూన్ నడిపిస్తూ మరోవైపు మ్యారేజి బ్యాండు టీంలో కలిసి పనిచేస్తూ శివానీతో లవ్‌లో పడే యువకుడిగా కనిపించాడు. ఈ మూవీలో పుష్ప ఫేం జగదీశ్‌ ప్రతాప్‌ బండారి మరియు గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా తెరకెక్కించాయి.

ఈ సినిమా కలెక్షన్స్ పరంగా చుస్తే సుహాస్ కెరీర్లోనే అంబాజీపేట మ్యారేజీ బ్యాండు అతిపెద్ద హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కలర్ ఫొటో మరియు రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన సుహాస్ కు క్రమంగా ఫాలోయింగ్ పెరుగుతుందనడానికి అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ కలెక్షన్లే నిదర్శనం అని చెప్పాలి. ఈ సినిమాకు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు.అంబాజీపేట మ్యారేజీ బ్యాండు బ్యూటీఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ లవ్‌స్టోరీ. కుల వివక్ష బ్యాక్‌డ్రాప్‌లో తమిళ డైరెక్టర్స్‌ కు పోటీగా తెలుగు దర్శకులు కూడా సినిమాలు తీయగలరని చాటిచెప్పే మూవీగా నిలిచింది.. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో ప్రతి ఒక్కరు పోటాపోటీగా నటించారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరో మాదిరిగా ఫైట్స్ చేయడం కాకుండా హీరో పడే సంఘర్షణను రా అండ్ రస్టిక్‌గా దర్శకుడు చూపించాడు. అలాగే శరణ్య పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సినిమాకు ఎంతో హైలైట్‌గా అనిపిస్తుంది.