Site icon NTV Telugu

Sriranga Neethulu : ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్ లోకి వచ్చేస్తున్న సుహాస్ మూవీ..

Sriranga Neethuu

Sriranga Neethuu

Sriranga Neethulu: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎంపిక చేసుకుంటూ సుహాస్ మంచి విజయాలు అందుకుంటున్నాడు.ఈ ఏడాది సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి విజయం సాధించింది.ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇక ఇదే ఏడాది సుహాస్ హీరోగా నటించిన మరో మూవీ శ్రీరంగనీతులు. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. టీజర్ ,ట్రైలర్ తో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించిన ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యాక అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Read Also :Mirzapur 3 : మీర్జాపూర్ సీజన్ 3 నుండి స్పెషల్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే ఈ సినిమాలో తనికెళ్ళ భరణి ,అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించారు. రాధావి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకటేశ్వరరావు బల్మూరీ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.శ్రీరంగనీతులు సినిమాను మే 30వ తేదీన యూట్యూబ్‏లో శ్రీభవానీ హెచ్డీ మూవీస్ ఛానెల్ లో ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. మే ౩౦ నుంచి శ్రీరంగనీతులు యూట్యూబ్ లో ఉచితంగా చూడొచ్చని మేకర్స్ తెలిపారు.

Exit mobile version