Site icon NTV Telugu

Sugarcane Farming:చెరుకు సాగుతో అధిక లాభాలు పొందుతున్న రైతులు..

Sugar

Sugar

మన దేశంలో చెరకు వాణిజ్య పంటగా చెరుకును పండిస్తారు.. ఈ పంటను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పండిస్తారు.6.0 లక్షల ఎకరాల విస్తీర్ణములో సాగుచేసి, 202 లక్షల టన్నుల చెఱకు ఉత్పత్తి చేస్తున్నాము. చెఱకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్‌, ఫిల్టర్‌ మడ్డి ఉత్పత్తిలను చేస్తారు. ఈ పంట అధిక దిగుబడి తో పాటు ఎక్కువ పంచదార పొందటానికి అనువైన శీతోష్ణ స్థితులు, రకములు, సాగుభూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనే ఆరు అంశాలు ప్రభావితం చేస్తాయి… చెరుకు సాగు గురించి మరిన్ని విషయాలు..

చెరుకు రకాలు..

1. ప్రారంభ పరిపక్వ రకాలు (9 -10 నెలలు) : Co6907, Co7505, 90A 272, 81A99, 82A123, 83A145,

2. మధ్య-ఆలస్య పరిపక్వ రకాలు (11-12 నెలలు) : CoA7602, CoT8201, Co7805, Co8021, 85R186, 86A146, 87A 397, 83V15, 83V288.

3. ఆలస్యంగా పక్వానికి వచ్చే రకాలు (12 -13 నెలలు): Co 7219, Co7706, Co8011, CoR8001..

ఈ చెరుకు సాగుకు వర్షపాతం, నీటి పారుదల ఎక్కువగా ఉండి, నల్ల రేగడి నేలలు బెస్ట్..నీటి యద్దడి బాగుంటే గడ బాగుంటుంది. వెచ్చగా ఉండే పెరుగుతున్న కాలం, స్పష్టమైన ఆకాశం, చల్లని రాత్రులు, వర్షపాతం లేని పొడి వాతావరణం, చక్కెరను నిర్మించడానికి పగలు, రాత్రి ఉష్ణోగ్రతల లో అధిక వ్యత్యాసం అవసరం. చెరకు పెరుగుదల కు 24, 30o C ఉష్ణోగ్రత అవసరం. భారతదేశంలో, 600 నుండి 3000 మి.మీ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో చెరుకు పెరుగుతుంది… చెరుకు కోతకు వచ్చినప్పుడు నీటి తడి పెట్టనవసరం లేదు.. వెచ్చని వాతావరణం అవసరం, 45 నుండి 65% తేమ + పరిమిత నీటి సరఫరా పండే దశలో ఉండాలి.. అధిక సూర్యరశ్మీ ఉంటే గడలు బాగా లావుగా రుచిగా ఉంటాయి.. మార్కెట్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది.. చెరుకు సాగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..

Exit mobile version