GOAT Teaser: బుల్లి తెరపై సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు.. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. కామెడీ షోతో తన కెరీర్ స్టార్ట్ చేసి యాంకర్‌గా మారి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు సుధీర్. ఆయన నటించిన కొత్త సినిమా GOAT. ఈ సినిమాలో హీరోయిన్‌గా దివ్య భారతి నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
READ ALSO: HYDRA : మారుతున్న ఓల్డ్ సిటీ బమృక్‌నుద్దౌలా చెరువు రూపురేఖలు
తాజాగా రిలీజ్ అయిన టీజర్‌లో సుడగాలి సుధీర్, దివ్య భారతి మధ్య వచ్చే కామెడీ సన్నివేషాలు అలరించాయి. అలాగే సారే సార్‌కు సార్ అని పేరు పెట్టుకున్నారు.. అంటూ సాగే సంభాషణలు సరదాగా ఉన్నాయి. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్‌పై మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తుండగా, మణిశర్మ బీజీఎం సమకూర్చుతున్నారు.
READ ALSO: Virat Kohli: ఈ టోర్నీలో ఆడటానికి ‘కింగ్’ కోహ్లీ నో చెప్పాడా?
