Site icon NTV Telugu

Maa Nanna Superhero OTT: ఓటీటీలో సుధీర్ బాబు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

Maa Nanna Superhero Ott

Maa Nanna Superhero Ott

నవ దళపతి సుధీర్‌ బాబు హీరోగా, అభిలాష్‌ రెడ్డి కంకర తెరకెక్కించిన చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. సునీల్‌ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో ఆర్ణ కథానాయికగా నటించారు. సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, విష్ణు, శశాంక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 2024 దసరా కానుకగా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మంచి హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

మా నాన్న సూపర్‌ హీరో సినిమా నవంబర్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ‘సూపర్ హీరో తండ్రులందరూ.. కొడుకు అందమైన, భావోద్వేగ ప్రయాణాన్ని చూడండి. జీ5లో డిజిటల్ ప్రీమియర్‌ని మిస్ అవ్వకండి. మా నాన్న సూపర్‌ హీరో సినిమాను కుటుంబంతో కలిసి చూడండి’ అని పోస్టర్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా నిర్మాత సునీల్ బలుసు, దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర, హీరో సుధీర్‌ బాబులు జీ5కు కృతజ్ఞతలు చెప్పారు.

Also Read: Sandeep Raj Engagement: నటితో టాలీవుడ్ డైరెక్టర్ ఎంగేజ్‌మెంట్‌.. పిక్స్ వైరల్!

‘మా నాన్న సూపర్‌ హీరో చిత్రంకు థియేటర్లలో లభించిన ప్రేమ, ప్రశంసలకు నేను పొంగిపోయాను. జానీ పాత్రతో ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. ప్రేమ, కర్తవ్యం, నిజాల మధ్య నలిగిపోయే పాత్ర అది. నాకు మద్దతు ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. నవంబర్ 15న జీ5లో సినిమా ప్రీమియర్‌ కానుంది. అక్కడ కూడా అదే ప్రేమ అందిస్తారని.. నా పాత్ర, సినిమాతో కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నా’ అని హీరో సుధీర్‌ బాబు అన్నారు. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల బంధాన్ని డైరెక్టర్ అద్భుతంగా చూపించారు.

Exit mobile version