Maa Nanna Superhero OTT: ఓటీటీలో సుధీర్ బాబు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
- అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు మా నాన్న సూపర్ హీరో
- స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవ దళపతి సుధీర్ బాబు హీరోగా, అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో ఆర్ణ కథానాయికగా నటించారు. సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, విష్ణు, శశాంక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 2024 దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మంచి హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
మా నాన్న సూపర్ హీరో సినిమా నవంబర్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ‘సూపర్ హీరో తండ్రులందరూ.. కొడుకు అందమైన, భావోద్వేగ ప్రయాణాన్ని చూడండి. జీ5లో డిజిటల్ ప్రీమియర్‌ని మిస్ అవ్వకండి. మా నాన్న సూపర్ హీరో సినిమాను కుటుంబంతో కలిసి చూడండి’ అని పోస్టర్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా నిర్మాత సునీల్ బలుసు, దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర, హీరో సుధీర్ బాబులు జీ5కు కృతజ్ఞతలు చెప్పారు.
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
Also Read: Sandeep Raj Engagement: నటితో టాలీవుడ్ డైరెక్టర్ ఎంగేజ్‌మెంట్.. పిక్స్ వైరల్!
‘మా నాన్న సూపర్ హీరో చిత్రంకు థియేటర్లలో లభించిన ప్రేమ, ప్రశంసలకు నేను పొంగిపోయాను. జానీ పాత్రతో ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. ప్రేమ, కర్తవ్యం, నిజాల మధ్య నలిగిపోయే పాత్ర అది. నాకు మద్దతు ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. నవంబర్ 15న జీ5లో సినిమా ప్రీమియర్ కానుంది. అక్కడ కూడా అదే ప్రేమ అందిస్తారని.. నా పాత్ర, సినిమాతో కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నా’ అని హీరో సుధీర్ బాబు అన్నారు. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల బంధాన్ని డైరెక్టర్ అద్భుతంగా చూపించారు.
An ode to all the superhero dads 🦸♂️
Watch the beautiful & emotional journey of a son. Don’t miss the digital premiere of #MaaNannaSuperheroOnZee5Pro Tip: Watch it with family#MaaNannaSuperhero Premieres on 15th November @Zee5Global @isudheerbabu @SayajiShinde #SaiChand pic.twitter.com/quuKMr9n2L
— ZEE5 Telugu (@ZEE5Telugu) November 11, 2024
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!