Sudheer Babu Said Harom Hara Movie will be a hit: ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో రాని కథతో ‘హరోం హర’ చిత్రం రూపొందిందని, కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని హీరో సుధీర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదని, సినిమా చూశాక ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్యంలా ఫీలవుతారనున్నారు. అడివి శేష్ తనకు స్ఫూర్తి అని సుధీర్ బాబు చెప్పారు. సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘హరోం హర’. ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. యువ హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
హరోం హర ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. అడివి శేష్, విశ్వక్ సేన్‌లపై ప్రశంసలు కురిపించారు. ‘అడివి శేష్ నాకు స్ఫూర్తి. ఎంతో కస్టపడి ఇండస్ట్రీలో ఈ స్థానానికి వచ్చాడు. శేష్ తన తలరాతను తానే రాసుకున్నాడు. సినిమా కథల విషయంలో చాలా మంది అభిప్రాయాలు తీసుకుని.. మార్పులు చేర్పులు చేసుకుంటాడు. ఈ రోజుల్లో ఓ హీరోకు మరో హీరో సపోర్ట్ చేసుకోవాలి. ఇక ఏ సినిమా ప్రీరిలీజ్ అయినా విశ్వక్ సేన్ వస్తాడు. అది అతడికి ఉన్న గొప్ప లక్షణం’ అని సుధీర్ తెలిపారు.
Also Read: AUS vs NAM: టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా!
‘హరోంహరలో నేను సుబ్రహ్మణ్యం పాత్ర చేశాను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. దీని కోసం చాలా మంది ఎంతో కష్టపడ్డారు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. నన్ను ఇలాంటి పాత్రలో చూడాలని మా మావయ్య కృష్ణ గారు కోరుకున్నారు. ఆయన ఉంటే చాలా ఆనందించే వారు. ఈ చిత్ర నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్యంలా ఫీలవుతారు’ అని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.