Sudha Kongara: తన ప్రతిభతో భాషా సరిహద్దులను చెరిపేసి అభిమానులను సొంతం చేసుకున్న దర్శకురాలు సుధా కొంగర. ఆమె దర్శకత్వంలో వచ్చిన ‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలు మంచి విజయాన్ని సాధించి, ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆమె ‘పరాశక్తి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. రవి మోహన్, అథర్వ కీలక పాత్రలు పోషించారు.
సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ సినిమా 2026 జనవరి 10న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మనసులోని మాటను వెల్లడించారు. తనకు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఒక లవ్ స్టోరీని తెరకెక్కించాలన్నది డ్రీమ్ అని చెప్పారు. ‘‘నాకు లవ్‌స్టోరీలంటే చాలా ఇష్టం. పూర్తిస్థాయి ప్రేమకథను తెరకెక్కించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది రజనీకాంత్ సర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటికే నా వద్ద కథ కూడా ఉంది. దాన్ని డెవలప్ చేయాలి’’ అని అన్నారు. అలాగే ఈ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘నేను అలసిపోయా అందుకే త్వరగానే రిటైర్ కావాలనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
READ ALSO: The Raja Saab : హీరోయిన్‌కు ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్.. మూడేళ్లు దాచిపెట్టిన రిద్ధి!
