ఇటీవల కాలంలో యువత ఎక్కువ మంది ఉద్యోగాలను వదిలేసి వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఇప్పుడు మనం ఓ బీటెక్ స్టూడెంట్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం..
బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి డ్రాగన్ ఫ్రూట్స్ ని పండిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… యూపీ లోని షహజహన్ పూర్ జిల్లా లోని చిలహువా గ్రామానికి చెందిన అతుల్ మిశ్రా బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు.. అందరి లాగానే ఆఫీసుల చుట్టు తిరిగి ఇంజనీరింగ్ జాబ్ ను సంపాదించాడు.. కానీ అతనికి అందులో సంతృప్తి లేకుండా పోయింది.. సొంత ఊరిలోనే ఏదైనా సాధించాలని అనుకున్నాడు.. మార్కెట్ లో డ్రాగన్ ఫ్రూట్ కు డిమాండ్ ఉందని తెలుసుకున్నాడు.. డ్రాగన్ ఫ్రూట్ ని పండించాలని అనుకున్నారు. 2018లో మహారాష్ట్ర లోని షోలాపూర్ నుండి ఈ మొక్కలను తీసుకు వచ్చి నాటించారు. అయితే బాగా ఫలితం ఉండడంతో ఐదెకరాల పొలం లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అతను పెంచడం మొదలు పెట్టారు. ఇంకా ఏడు ఎకరాల బంజరు భూమి ఉందని… అందులో కూడా డ్రాగన్ ఫ్రూట్స్ ని పండించాలనుకుంటున్నాడు..
అదే ఆలోచనను ఆచరణలో పెట్టాడు..నలుగురికి ఉపాధి కల్పించి వీటిని పెంచుతున్నారు.. డ్రాగన్ ఫ్రూట్ తో చాలా లాభాలు వస్తున్నాయని అతను చెప్పారు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పెంచి తన వద్దకు వచ్చే రైతులకు అమ్ముతున్నారు అతుల్. మధ్యప్రదేశ్, బీహార్, యూపీ తో పాటు కొన్ని రాష్ట్రాల రైతులు కూడా వాటిని కొనుగోలు చేస్తున్నట్లు అతుల్ చెబుతున్నారు.. అలా పండ్లను అమ్మడం మాత్రమే కాదు స్వంతంగా మొక్కలను కూడా అమ్ముతూ బాగానే సంపాదిస్తున్నాడు.. అతన్ని చాలా మంది రైతులు కూడా ఫాలో అవుతున్నారు.. మొత్తానికి అతను ఆదర్శంగా నిలిచాడు.. మంచి సంపాదన కూడా బాగానే ఉందని చెబుతున్నారు..