NTV Telugu Site icon

Success Story: ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి..కలబంద సాగు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న రైతు..

Success Story (2)

Success Story (2)

ఈ మధ్య కాలంలో చాలామంది యువకులు వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. కేవలం ఆసక్తి మాత్రమే కాదు.. అందుకున్నది సాధిస్తున్నారు.. లక్షలు సంపాదిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. సంప్రదాయ పంటల కన్నా ఎక్కువగా ఔషద పంటలను ఎక్కువగా పండిస్తున్నారు.. వాటితో ఎక్కువ లాభాలను పొందుతూన్నారు..ఇప్పుడు మనం చెప్పుకొనే యువ రైతు ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి కలబంద సాగు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు.. ఇక ఆ రైతు గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

రైతుగా మారిన ఇంజనీర్ పేరు హరీష్ ధందేవ్. రాజస్థాన్ నివాసి. హరీష్ ధందేవ్ మొదటి ప్రభుత్వ ఇంజనీర్. జైసల్మేర్ మున్సిపల్ కౌన్సిల్‌లో జూనియర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతని మనస్సు ఉద్యోగం చేయడంలో నిమగ్నమై లేదు. అందుకే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి గ్రామానికి వచ్చి కలబంద సాగు మొదలు పెట్టాడు. ఈ నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం కలబంద అమ్మి లక్షాధికారి కాదు ఏకంగా కోట్లు గడిస్తున్నారు..నిజంగా గ్రేట్ కదా..

రాజస్థాన్‌లోని చాలా మంది రైతులు మిల్లెట్, మొక్కజొన్న, గోధుమ వంటి సాంప్రదాయ పంటలను సాగు చేస్తారు. అయితే హరీష్ ధందేవ్ మాత్రం తాను సాంప్రదాయ పంటలకు బదులు ఔషధ పంటలు పండించాలని నిర్ణయించుకున్నాడు. నేడు కలబంద సాగు చేస్తూ రైతుగానే కాదు పారిశ్రామికవేత్తగా కూడా మారాడు.. అతను కలబంద లోని అలోవెరాలోని బార్బీ డెనిస్ అనే ఒకే ఒక రకాన్ని మాత్రమే పండిస్తున్నాడు. ఈ రకమైన అలోవేరాకు హాంకాంగ్, బ్రెజిల్, అమెరికాలో ఫుల్ డిమాండ్ ఉంది. బార్బీ డెనిస్ కలబందను లగ్జరీ కాస్మెటిక్స్ ఉత్పత్తులలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు.. 80 వేల కలబంద మొక్కలతో వ్యవసాయం ప్రారంభించాడు హరీష్. ఇప్పుడు ఆయన పొలంలో లక్షల్లో కలబంద మొక్కలు నాటారు. హరీష్ ధందేవ్ తన పొలంలో పండిస్తున్న అలొవెరాను పతంజలికి అధికారిక సరఫరాదారు. దీని వల్ల అతని కంపెనీ చాలా లాభపడుతోంది.. దాంతో అన్ని ఖర్చులుపోగా అతను 3 కోట్లు ఏడాదికి సంపాదిస్తున్నారు..

Show comments