Subhashree Rayaguru: నిర్మాతతో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎంగేజ్మెంట్.. ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ

  • నిర్మాతతో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎంగేజ్మెంట్
  • నిర్మాత అజయ్‌ మైసూర్‌ను పెళ్లాడబోతుంది
Subhashree Rayaguru

Subhashree Rayaguru

సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మొగుతున్నాయి. పలువురు నటీనటులు వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా అక్కినేని అఖిల్ తన ప్రియురాలు జైనబ్‌ ను పెళ్లాడారు. ఇప్పుడు మరో జంట త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది. తెలుగు బిగ్‌బాస్‌ 7 సీజన్‌ శుభశ్రీ రాయగురు ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్‌ మైసూర్‌ను పెళ్లాడబోతుంది. తాజాగా శుభశ్రీ నిర్మాతతో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది.

Also Read:Mayawati: బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిరోజులొస్తాయి

ఫైనల్లీ.. మా ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని క్యాప్షన్‌ జోడించింది. ఇది తెలిసిన అభిమానులు, పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒడిశాకి చెందిన శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యింది. అంతకు ముందు.. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. అయితే సినిమాల ద్వారా సంపాదించలేకపోయిన క్రేజ్‌ బిగ్ బాస్‌తో రాబట్టింది.