టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ సినీ లోకం ఆవేదన చెందుతోంది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. అయితే తాజాగా ఎన్టీవీతో ప్రముఖ నిర్మాత సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో విశాఖపట్నంలో సత్యనారాయణకు లక్షలాది మంది ప్రేక్షకుల సమక్షంలో స్వర్ణ కంకణం బహుకరించాను. ఇది గొప్ప సన్మానం… జీవితంలో మర్చిపోలేను అని ఆనాడే చెప్పారు. కైకాల సత్యనారాయణకు పద్మశ్రీ రావడం న్యాయం. కానీ రాలేదు. తెలుగు వారికి పద్మశ్రీ రాదు.. అంతా తమిళ్.. వేరే వాళ్ళకే. రికామెండేష్ లేదు.
ఏదో డిఫరెంట్ టెక్నాలజీ పెట్టారు. ఇప్పుడు పద్మశ్రీ అవార్డులు తెలుగువారికి రావడం లేదు. చిరంజీవి, టి.సుశీల, మోహన్ బాబు, బ్రహ్మానందం కు నేనే పద్మశ్రీ ఇప్పించాను. నేను పర్సనల్ గా పట్టుబట్టి ప్రధాన మంత్రిని ఒప్పించాను. నటనలో ఆయనకు ఆయనే సాటి. 50 సంవత్సరాలుగా సత్యనారాయణ నాకు మంచి స్నేహితుడు. సత్యనారాయణ అంటే చాలా అభిమానం. కైకాల సత్యనారాయణ గొప్ప విలక్షణ నటుడు. ఇన్ని సంవత్సరాల్లో కైకాల ఎవర్ని నొప్పించ లేదు.. ఎవరితో నొప్పింప బడలేడు. మా బ్యానర్ లో వచ్చిన అన్ని సినిమాల్లో కైకాల నటించారు. సూర్య ఐపీఎస్ లో సత్యనారాయణ నటన అద్భుతం. అందరికి కన్నీటి తెప్పించారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.