Stuffed Toys: ఈ రోజుల్లో దాదాపు అందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా కష్టపడి పెంచుతున్నారు. పిల్లలను గాజు బొమ్మల్లా చూసుకుంటారు. పిల్లలు అడిగినన్ని బొమ్మలు కొనిపెడతారు. కానీ.. పిల్లలకు కొన్ని బొమ్మల నుంచి దూరంగా ఉంచాలని, లేదంటే దాని వల్ల పిల్లలు ఆనారోగ్యానికి గురవుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. స్టప్డ్ బొమ్మలు వలన చిన్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు రోజు రోజుకు పెరుతున్నాయని హెచ్చరిస్తున్నారు. దీనిని పిల్లలకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.
స్టప్డ్ బొమ్మలు..
ఈ బొమ్మలు (స్టప్డ్ బొమ్మలు) చూడటానికి ముద్దుగా, మెత్తగా ఉంటాయి. వాటిని చూడగానే పిల్లలు ఆకర్షితులు అవుతారు. అది కావాలని మారం చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులు వెనక ముందు ఆలోచించకుండా వాటిని కొని పిల్లల చేతిలో పెట్టేస్తారు. దాని వల్ల పిలలు అనారోగ్యానికి గురవుతారని తెలుసా? ఎందుకంటే.. చూడటానికి స్టప్డ్ బొమ్మలు మొత్తగా వున్నా అవి పిల్లలు ఆడుకుంటూ ఎక్కడంటే అక్కడ విసురుతూ.. కింద నేలపై రాస్తూ మళ్లీ వాటినే తీసుకుని పక్కనే పెట్టుకుని పడుకుంటారు. కానీ దానికి దుమ్ము, ధూళి తగిలి ఉంటుంది. వాటిని పక్కనే పిల్లలు పెట్టుకోవడం వలన శ్వాసకోశ సమస్యల బారినపడే అవకాశం ఉంటుంది.
Read also: Free Gas Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించి.. టీ చేసిన సీఎం!
ఎందుకంటే.. ఆ బొమ్మలకు మురికి అంటి ఉండటం వలన దానిని పిల్లలు పక్కనే పెట్టుకుని ఊపిరి పీల్చేటప్పుడు దానికి వున్న ధూళి ముక్కు, నోటి ద్వారా లోపలికి వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని వలన పిల్లలకు ఆస్తమా బారిన పడే ప్రమాదం ఉంది. శ్వాసకోశ సమస్యలను కూడా తీవ్రతరమై, ఇవి తుమ్ములు, దగ్గు, జలుబుకు కారణమవుతాయి. దీంతో పిల్లలకు ఇన్ఫెక్షన్, అలెర్జీలకు మూలం కావచ్చు. అంతేకాకుండా.. ఉబ్బసం అనేది దీర్ఘకాలిక పరిస్థితి, ఇది శ్వాసనాళాల వాయుమార్గాల వాపును కలిగి ఉంటుంది, ఇది శ్వాసలోపం వంటి లక్షణాలకు దారితీస్తుంది.
Read also: Fenugreek Leaves: వారానికి ఒక్కసారైనా తినండి.. మార్పు మీరే చూడండి!
ఎకాలజీ సెంటర్ 2008 అధ్యయనం ప్రకారం, పరీక్షించిన మొత్తం బొమ్మల్లో 33 శాతానికి పైగా సీసం, కాడ్మియం మరియు థాలేట్‌లతో సహా హానికరమైన స్థాయి పదార్థాలను కలిగి ఉంటాయి, ఇవి క్యాన్సర్ కారక, ఉత్పరివర్తనానికి కారణమవుతాయి. పునరుత్పత్తి సమస్యలతో ముడిపడి ఉంటుంది. అందుకే ఇటువంటి బొమ్మలను పిల్లలకు దూరంగా ఉంచాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ పిల్లలు వీటిని కావాలని మారం చేస్తే.. తల్లిదండ్రులు చేయవలసిన పనులు, బొమ్మల ద్వారా ఆస్తమా బారిన పడిన పిల్లలకు మార్గాలు ఏమిటో తెలుసుకుందాం..
Read also: Bibek Debroy: ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ దేబ్రోయ్ కన్నుమూత
బొమ్మలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
1. ప్రతి వారం మీ పిల్లల స్టఫ్డ్ బొమ్మలను వేడి నీటిలో కడగాలి
2. వాటిని పిల్లోకేస్ లేదా లోదుస్తుల సంచిలో ఉంచండి
కనీసం 45 నిమిషాల పాటు అధిక వేడి మీద బొమ్మను డ్రైయర్‌లో ఆరబెట్టండి
3. వేడి నీరుటితో కడిగి ఎండబెట్టడం వల్ల ఏదైనా దుమ్ము, పురుగులు, జెర్మ్స్ సమర్థవంతంగా తొలగిపోతాయి.
4. అంతేకాకుండా.. ఎక్కు ఘాటుగా వుండే డిటర్జెంట్ కాకుండా తేలికపాటి డిటర్జెంట్ వేసి, గోరువెచ్చని నీటిని ఉపయోగించి శుభ్రంచేయాలి. బొమ్మ యొక్క బాహ్య భాగాన్ని పూర్తిగా స్క్రబ్ చేయండి. వాటిని ఎండలో ఆరనివ్వండి.
5. స్టఫ్డ్ బొమ్మలను శుభ్రం చేయడానికి హ్యాండ్ శానిటైజర్ జెల్ ఉపయోగించవద్దు.
6. మీరు ఫ్లోర్‌ను వాక్యూమ్ చేస్తున్నప్పుడు అన్ని మీ పిల్లల బొమ్మలను కూడా వాక్యూమ్ చేయండి. ఇది దుమ్ము పురుగులను పీల్చుకుంటుంది.
7.మీ చిన్నారికి అప్‌డేట్ చేయబడిన COVID-19 వ్యాక్సిన్‌ని అందజేసి, ఏడాదికోసారి ఫ్లూ వ్యాక్సిన్‌ను అందజేసినట్లు నిర్ధారించుకోండి.
8. మీ పిల్లలకు చేతులు, శరీరంలో ఎక్కడైన మంట కలుగుతున్నట్లు అయితే.. వాటి పరిమాణం ఎంతవుంది.. తెలుసుకోని వెంటనే వైద్యులను సంప్రదించి వాటికి సరైన మందులను వాడండి..
9. మీ పిల్లలను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వెంటనే వారికి బొమ్మలను దూరంగా ఉంచండి.
10. ఆస్తమాకు సంబంధించిన మందులు, టానిక్ లను వాడండి.. వైద్యులను తప్పకుండా సంప్రదించండి.
Sheikh Hasina: బంగ్లాదేశ్లో షేక్ హసీనా పార్టీ కార్యాలయానికి నిప్పు..