Site icon NTV Telugu

Short people: పొడవుగా ఉన్నవాళ్ల కంటే.. పొట్టిగా ఉన్నవాళ్లే ఎక్కువకాలం బ్రతుకుతారు..

Short People

Short People

పొడవుగా ఉన్నవాళ్లు ఎక్కువ రోజులు జీవిస్తారా? పొట్టిగా ఉన్నవాళ్లా? అనే అంశంపై పరిశోధకులు 130 కంటే ఎక్కువ అధ్యాయనాలను సమీక్ష చేశారంట. దాదాపుగా 1.1 మిలియన్ ప్రజల ఎత్తు గురించి, వారి మరణానికి గల కారణాలపై సమాచారాన్ని సేకరించారినట్లు తెలుస్తోంది. వ్యక్తుల ఎత్తు.. పలు కారణాలతో వారు చనిపోవడానికి మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. గత 30 ఏళ్లుగా జరిగిన పరిశోధనల్లో హైట్ ఎక్కువగా ఉన్నవాళ్లు తక్కువ కాలం బ్రతికినట్లు.. పొట్టిగా ఉన్నవారు ఎక్కువకాలం జీవిస్తున్నట్లు వారి ఆధ్యాయనాల్లో వెల్లడించారు.

Read Also: Rajasthan Gangrape: దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్.. ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి మరీ..

ఇటాలియన్ మిలిటరీలో పనిచేసిన పురుషుల అధ్యయనం ప్రకారం 161.1 సెంటి మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్నవారు ఎక్కువ రోజులు జీవించారని తెలుస్తోంది. 70 సంవత్సరాల వయసులో పొట్టిగా ఉన్నవారు పొడవుగా ఉన్నవారి కంటే సుమారు 2 సంవత్సరాలు ఎక్కువగా జీవించే ఛాన్స్ ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఇక 2017లో జరిగిన ఓ అధ్యాయనం ప్రకారం 1946-2010 మధ్య బాస్కెట్ బాల్ ఆడుతూ జీవించి, మరణించిన 3వేల 901 మంది క్రీడాకారుల ఎత్తును, జీవితకాలాన్ని కూడా అన్వేషించారట. మాజీ బాస్కెట్ బాల్ ఆటగాళ్లలో పొడవుగా ఉన్న వాళ్లలో దీర్ఘాయువు తక్కువగా ఉందని తేలినట్లు వారు పేర్కొన్నారు.

Read Also: OG Movie: పవన్ సినిమాలో అమితాబ్ బచ్చన్.. గుండె ఆగిపోయేలా పోస్టర్.. ?

అయితే, హైట్ ఎక్కువగా ఉన్న వ్యక్తులు తక్కువ జీవితం, పొట్టి వ్యక్తులు ఎక్కువ కాలం బ్రతుకుతారు అనేది పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. వారి వారి జీవన శైలిని బట్టి కూడా దీర్ఘాయువు ప్రభావితం చేస్తుంది అని పరిశోధకులు తెలిపారు. ఆల్కహాల్, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఎక్కువగా వ్యాయామం చేయడం, తక్కువ పొల్యూషన్ ఉన్న ప్రాంతంలో జీవించడం వంటికి కూడా దీర్ఘాయువును పెంచే మార్గాలు అని చెప్పారు. అనేక అధ్యాయనాలు ఎత్తు .. జీవిత కాలం మధ్య సంబంధాన్ని కనుగొన్నాయి. అయితే వీటిని గుడ్డిగా ఫాలో అవడం అంత మంచిది కాదు అని పరిశోధకులు వెల్లడించారు. మంచి జీవన విధానం ఆయుష్షును పెంచుతుందని వారు పేర్కొన్నారు.

Exit mobile version