ఒక చిన్న వివాదం చిలికిచిలి కి గాలి వానగా మారింది. విద్యార్థులు కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. తమను బెదిరించారని ఒక జట్టు గట్టిన 13 మంది విద్యార్థులు తోటి విద్యార్థిని చితకబాదిన ఘటన ఇది. వీరంతా చదువుతున్నది కేవలం ఆరవ తరగతి మాత్రమే. ఆరవ తరగతిలోనే కక్షలు కార్పన్యాలతో ప్రతీకారం తీర్చుకునే స్థాయికి వెళ్లిన ఘటన ఇది. ఇది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలోని tswrjc హాస్టల్లో ఈ ఘటన జరిగింది. ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి సాల్వం రాజును అదే తరగతికి చెందిన 13 మంది విద్యార్థులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
గతంలో ఒక చిన్న వివాదంలో సాల్వం రాజు విద్యార్థులని బెదిరించడం జరిగింది. అప్పటినుంచి కక్ష పెట్టుకున్న మిగతా విద్యార్థులు అవకాశం కోసం ఎదురుచూసి మూడు రోజుల క్రితం హాస్టల్ రూమ్ లో రాజు పై దాడి చేశారు. చుట్టూ తలుపులు వేసి కర్రలతో తీవ్రంగా కొట్టారు ఈ దాడిలో రాజు చేయి విరిగింది. ఒళ్లంతా కమిలిపోయింది అయితే ఆలస్యంగా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు బియ్యం బంజర పోలీసుల్ని ఆశ్రయించారు.