రెండు తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి ఉత్తీర్ణత కోసం పబ్లిక్ పరీక్షలు రాసి అందులో మంచి మర్క్స్ సాధించిన తర్వాతే.. కాలేజి లైఫ్ లోకి ఎంటర్ అవుతాం. అలాంటి పదవ తరగతి పాస్ అవ్వడం అనేది విద్యార్థిగా ఉన్న సమయంలో ఓ కీలక ఘట్టం. మంచి ఉద్యోగాలు సాధించాలన్న, ఉన్నత చదువులను చదవాలన్న దానికి ప్రామాణికం పదో తరగతి మార్కులు మొదటిగా చూస్తారు. దేశంలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కూడా కనీస అర్హత పదవ తరగతి గా నిర్ణయించడం జరుగుతుంది. ఇదివరకు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలంటే చాలా గొప్పగా చెప్పుకునే రోజులు కాకపోతే కాలం మారుతున్న కొద్దీ విద్య అందుబాటులోకి రావడంతో పెను మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో 10వ తరగతి ఉత్తీర్ణత చాలా తేలికగా మారిందని చెప్పవచ్చు. ఒకవేళ మొదటిసారి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన సరే.. మరో నెలలో వచ్చే సప్లమెంటరీ పరీక్షల్లో తిరిగి ఉత్తీర్ణత సాధించవచ్చు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా పదవ తరగతి పరీక్ష రాసిన ఓ విద్యార్థి చేసిన పని వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే..
Also Read: GT vs RR Dream11 Prediction: రాజస్థాన్ vs గుజరాత్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
2024 మార్చి నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో ఓ విద్యార్థి తనకు మార్పులు వేయకపోతే తన తాత చేత చేతబడి చేయిస్తానంటూ రాయడం ఇప్పుడు వైరల్ గా మారింది. పదో తరగతి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో పరీక్ష పత్రాలు మూల్యాంకనం బాపట్ల జిల్లాలోని బాపట్ల పూరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగు పరీక్షలు రామాయణం ప్రాసత్యం గురించి రాయమని అడిగిన ప్రశ్నకు ఓ విద్యార్థి తగిన సమాధానం రాయకుండా.. ‘నాకు మార్పులు వేయకపోతే మాత్రం మా తాత చేతబడి చేయిస్తా’ అంటూ రాయడంతో అక్కడ ఉపాధ్యాయులు ఒకింత షాక్ అయ్యారు.
Also Read: Chiranjeevi: బాసూ, అదిరింది నీ గ్రేసు.. ఎలా ఇలా?
కాకపోతే ఈ విషయంపై పరీక్ష జవాబు పత్రాన్ని పై అధికారులకు చూపించగా వారు కూడా అవక్కయ్యారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఇలాంటి భయపెట్టే సమాధానాలు రాసిన సదరు విద్యార్థికి 70 మార్కులు రావడం విశేషం.
