Site icon NTV Telugu

Medchal: జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి 8 రోజుల కింద మిస్సింగ్.. ఇప్పటికీ లభించని ఆచూకీ

Student Missing

Student Missing

మేడ్చల్ లో జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కార్తీక్(14) మిస్సింగ్ కలకలం రేపింది. ఎనిమిది రోజుల కింద మిస్సింగ్ కాగా, ఇప్పటి వరకు ఆచూకీ లభించకపోవడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎనిమిది రోజుల నుండి స్కూల్ పరిసర ప్రాంతాల్లో వెతికినా లభించని బాబు ఆచూకీ.. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read:BMW : భర్త మహాశయులకు విజ్ఞప్తితో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతాడా..?

స్కూల్ ఆవరణంలో చలిమంట వేసుకోవడంతో వార్డెన్ చితకబాధారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కొడుకు విషయం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ తమ కొడుకు బ్రతికే ఉన్నాడా లేడా అని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాబు ఆచూకీ కోసం మేడ్చల్ పోలీసులు గాలిస్తున్నారు. జాన్ అకాడమీ స్కూల్ ఇంచార్జి రోసి తమ బాబును కొట్టడంతోనే కనిపించకుండా పోయడని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

Exit mobile version