NTV Telugu Site icon

Stuart Broad Unique Record: చివరి బంతికి సిక్స్‌, వికెట్‌.. క్రికెట్ చరిత్రలో ఏకైక ఆటగాడిగా స్టువర్ట్‌ బ్రాడ్‌!

Stuart Broad Test

Stuart Broad Test

Stuart Broad Signs Off With Six and Wicket Off His Last Balls in Test Cricket: ఇంగ్లండ్‌ వెటరన్ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ తన టెస్టు కెరీర్‌కు చిరస్మణీయ ముగింపు పలికాడు. కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడిన బ్రాడ్‌ రెండు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అదే సమయంలో క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డు నెలకొల్పాడు. తాను ఎదుర్కొన్న ఆఖరి బంతిని సిక్స్‌గా.. అదే విధంగా చివరి బంతికి వికెట్‌ తీశాడు. చివరి బంతికి సిక్స్‌, వికెట్‌ తీసిన ఏకైక ఆటగాడు బ్రాడ్‌ మాత్రమే.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 80 ఓవర్‌లోని చివరి బంతిని పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ అద్భుతమైన సిక్సర్‌గా మలిచాడు. అతడి కెరీర్‌లో అదే చివరి బంతి. అదేవిధంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా.. బౌలింగ్‌లో కూడా బ్రాడ్‌ చివరి బంతిని వికెట్‌తోనే ముగించడం విశేషం. ఆసీస్‌ బ్యాటర్‌ అలెక్స్‌ క్యారీని అతడు ఔట్‌ చేశాడు. ఆఖరి డెలివరీలో ఒక వికెట్‌, సిక్సర్‌తో (Stuart Broad Six, Wicket Off Last Balls) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏకైక ఆటగాడు బ్రాడ్‌ మాత్రమే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

స్టువర్ట్‌ బ్రాడ్‌ తన 16 ఏళ్ల కెరీర్‌లో 167 టెస్ట్‌లు, 121 వన్డేలు, 56 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు (604) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్‌.. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్‌ 244 ఇన్నింగ్స్‌లు ఆడి 3,662 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ (169), 13 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక యాషెస్‌ 2023 ఐదో టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమమైంది.

Also Read: Tomatoes Lorry: 21 లక్షల విలువైన టమాటాల లారీ మాయం.. ఎక్కడో తెలుసా?