Site icon NTV Telugu

Iran: ఇరాన్‌లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి, 440 మందికి గాయాలు

Iran

Iran

Iran Earthquake: ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌లోని ఖోయ్ నగరంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు నేలమట్టం కాగా.. 440 మందికి గాయాలయ్యాయి. శిథిలాలు మీద పడి కొందరు మరణించగా.. తప్పించుకునే ప్రయత్నంలో భవనాలపై నుంచి దూకి వందలాది మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సహాయక సిబ్బంది ప్రజలను రక్షించి వారిని ఆస్పత్రులకు తరలించారు. ఆసుప‌త్రుల‌కు స‌మాచారం అందించి, ముంద‌స్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాల‌ని చెప్పామ‌ని ఇరాన్ అత్యవ‌స‌ర సేవ‌ల విభాగ అధికారులు వెల్లడించారు.

Bus Accident: లోయలో పడిన బస్సు.. 24 మంది దుర్మరణం

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మంచు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిసింది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో బాధితుల ఆర్తనాదాలు చేస్తుండడం కలచివేస్తోంది. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, విద్యుత్ కోతల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి సంవత్సరాలలో అనేక విధ్వంసకర భూకంపాలను ఇరాన్‌ చవిచూసింది.

Exit mobile version