Site icon NTV Telugu

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 20 మంది మృతి, 300 మందికి గాయాలు

Earthquake

Earthquake

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభంవించింది. ఇండోనేషియాలోని వెస్ట్‌ జావాలో సోమవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి గాయాలయ్యాయి. 5.6 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

MLA Attacked by Locals: ఏనుగుదాడిలో మహిళ మృతి.. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను తరిమికొట్టిన జనం

ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించండంతో భూప్రకంపనల వల్ల ఇళ్లు, కొన్ని నిర్మాణాలు కూలిపోయాయి.

Exit mobile version