NTV Telugu Site icon

Viral Video: వీడియో.. కిడ్నాపర్ల బారి నుంచి బాలికను కాపాడిన వీధి కుక్క

Girl

Girl

Street Dog Saved Girl From Kidnappers: కుక్కలు విశ్వాసానికి మారుపేరు. వాటికి కొంచెం సాయం చేస్తే చాలు మనల్ని గుర్తుపెట్టుకొని ఎంతో నమ్మకంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో కుక్కలు మనుషులను కాపాడినట్లు చూస్తూ ఉంటాం. తాజాగా ఓ వీధి కుక్క స్కూల్ నుంచి వస్తున్న బాలికను కిడ్నాపర్ల బారి నుంచి కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైలర్ అవుతుంది.

వీడియో ప్రకారం ఓ బాలిక స్కూల్ నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది. రెడ్ కలర్  కోటు వేసుకున్న ఆ బాలిక రోడ్డుపై ఒంటరిగా ఉంటుంది. ఇంతలో వెనుక నుంచి ఒక కారు వస్తుంది. ఆ బాలిక వద్దకు రాగానే ఆ కారు నెమ్మదిగా ఆగుతుంది. ఎవరో దాని డోర్ ను కారు లోపలి నుంచి నెమ్మదిగా తెరుస్తారు. బాలిక ఇదంతా చూసి కంగారుగా వెనకకు చిన్నచిన్నగా నడుస్తూ ఉంటుంది. అంతలో ఓ వీధి కుక్క వేగంగా పరిగెత్తూకుంటూ వచ్చి వారిపై అరుస్తుంది. దీంతో భయపడిపోయిన కిడ్నాపర్ లు అక్కడి నుంచి పారిపోయారు. ఆ బాలిక పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుక్కకు తెలియకుండానే తన వీధులోకి కొత్త వ్యక్తులు రావడంతో వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దాంతో వారు ఆ బాలికను వదిలేసి వెళ్లిపోయారు. తెలిసి చేసినా, తెలియక చేసినా కుక్క వల్ల బాలికకు మంచి జరిగింది.

Also Read: Uttar Pradesh: వీడు మాములోడు కాదు.. ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సినిమా చూపించాడుగా

ఈ మొత్తం ఘటన అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెారాలో రికార్డ్ అయ్యింది. ఈ కుక్క ఒక పెద్ద బోన్ కొనియాలి అని క్యాప్షన్ జోడించి దీనిని సీసీటీవీ ఇడియట్స్ అనే యూజర్ ఎక్స్ (ట్వీటర్) ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు. లక్షకు పైగా లైక్ లు వచ్చాయి. ఈ వీడియో చూసిన వారు పెంపుడు కుక్కల వల్లే కాదు వీధి కుక్కల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. సూపర్ డాగ్ అంటూ మరికొంతమంది కొనియాడుతున్నారు. ఇక కుక్కకు మంచి బోన్ కొనియాలని సూచిస్తున్నారు.  ఆ బాలిక ఎవరో తెలియకపోయినా ఆమెను కుక్క కాపాడిందంటూ నెటిజన్లు ఆ కుక్కను మెచ్చుకుంటున్నారు.

 

Show comments