Prayagraj Stray Dog Crisis: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ నగరంలో వీధికుక్కల సంఖ్య 1 లక్ష 15 వేలు దాటింది. ప్రతి నెలా నాలుగు వేలకు పైగా కుక్క కాటు సంఘటనలు జరుగుతున్నాయి. వీధికుక్కల కారణంగా ప్రతి నెలా వందలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బ్యాంకు మేనేజర్‌ను ఒక వీధికుక్క వెంబడించింది. తప్పించుకుని పారిపోతుండగా.. మున్సిపల్ చెత్త ట్రక్కు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన ఒక్కసారిగా నగరంలో కలకలం సృష్టించింది. వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడానికి, మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని నిర్మించింది. ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ పశువుల, జంతు సంక్షేమ అధికారి విజయ్ అమృత్ రాజ్ ప్రకారం.. ఈ కేంద్రాన్ని నగరంలోని షామ్స్ నగర్‌లో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీనిలో కుక్కలకు క్రిమిరహితం చేసి టీకాలు వేస్తారు. దీనితో పాటు, మరో జంతు జనన నియంత్రణ కేంద్రం సిద్ధంగా ఉంది.
తాజాగా పెరుగుతున్న వీధికుక్కల దాడులను దృష్టిలో ఉంచుకుని పరిపాలన ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. మొదటిసారి మనిషిని కరిచిన కుక్కను 10 రోజుల పాటు ఏసీబీ సెంటర్‌లో ఉంచాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత దాని శరీరంలో మైక్రోచిప్‌ను అమర్చి.. విడుదల చేస్తారు. ఆ కుక్క మళ్లీ ఎవరినైనా కరిస్తే, దానికి జీవిత ఖైదు విధించాలని నిర్ణయించారు. ఇక.. దానిని ఏబీసీ సెంటర్‌లో నిర్మించిన ఆశ్రయంలో అంటే జంతు జనన నియంత్రణ కేంద్రంలో జీవితాంతం ఉంచుతారు. మున్సిపల్ కార్పొరేషన్ లైవ్‌స్టాక్ ఆఫీసర్ విజయ్ అమృత్ రాజ్ ప్రకారం.. ఈ ఉత్తర్వును అన్ని మున్సిపల్ సంస్థలకు ముఖ్య కార్యదర్శి అర్బన్ డెవలప్‌మెంట్ జారీ చేశారు. కుక్క రెండవసారి కరిస్తే, ముగ్గురు సభ్యుల కమిటీ దానిపై దర్యాప్తు చేస్తుంది. ఇందులో పశుసంవర్ధక అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, SPCA సభ్యులు ఉంటారు. ఆధారాలు దొరికితేనే, కుక్కకు జీవిత ఖైదు విధిస్తారు.
READ MORE: Puja Khedkar: డ్రైవర్ కిడ్నాప్‌లో కీలక ట్విస్ట్.. పూజా ఖేద్కర్ ఫ్యామిలీ ఏం చేసిందంటే..!
